భారతదేశంలో కుటుంబ విలువలు, సంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను చూపిస్తుంటారు. అన్నదమ్ముల్లు, అక్కాచెల్లిల్లు, తల్లిదండ్రులు, భార్యాభర్తల ఇలా ఎన్నో అనుబంధాల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. సాధారణంగా భారత్‌లో పురుషులు అత్తమామల కూతురు, అక్క కూతురు ఇలా వరుసకి మరుదలు అయిన వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం అన్నాచెల్లెల్ల బంధాన్ని భార్యభర్తలుగా మార్చేసింది. చాలా విచిత్రంగా ఉంది కదా. ఆ ప్రాంతంలో ఒకే తల్లి కడుపున పుట్టిన స్త్రీ, పురుషుడు పెళ్లి చేసుకుంటారు. చాలా ఏళ్లుగా ఈ పద్దతి పాటిస్తున్నారు.
Also Read: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు
సొంత అన్నాచెల్లికి పెళ్లి
ఇంతకి ఆ ఆచారాన్ని ఎక్కడ పాటిస్తున్నారు అనే కదా మీ డౌట్. ఇలాంటి వింత పెళ్లిని ఛత్తీస్‌గఢ్‌లో పాటిస్తున్నారు. వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన జనాభా ఎక్కువ. అయితే అక్కడ ధుర్వా అనే గిరిజన తెగ ఉంది. ఈ కమ్యూనిటీకి చెందిన ప్రజలు సామన్య ప్రజల జీవిన విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ధుర్వా గిరిజన సంప్రదాయం ప్రకారం చూసుకుంటే ఒకే తల్లి కడుపున పుట్టిన అబ్బాయిలు, అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.
పెళ్లిక నిరాకరిస్తే శిక్ష
అయితే ఇలాంటి సంస్కృతిని అక్కడ ఎందుకు పాటిస్తున్నారో సరైన వివరణ లేదు. కానీ ఎవరైన సోదరులు.. తమ సోదరీమణులను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తే.. వాళ్లను కఠినంగా శిక్షిస్తారు. ఈ గిరిజన సంఘం సంస్కృతిపై తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. అయినా కూడా తమ జాతిలో జనాభా పెరుగుదల కోసమే ఇలాంటి పద్ధతిని అనుసరిస్తున్నామని ఆ గిరిజన ప్రజలు చెప్పుకుంటున్నారు.
Also Read: లోక్ సభ బరిలోకి బాలీవుడ్ హీరో.. అక్కడినుంచే పోటీ!