Rain Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

TG: ఈరోజు నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, SRCL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Rain Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
New Update

Telangana Rains : తెలంగాణలో ఈరోజు నుంచి మూడ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (Yellow Alert) జారీ చేసింది. అలాగే.. ఎల్లుండి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.

Also Read : నడిరోడ్డు పై ఓ వ్యక్తిని కత్తులతో నరికి చంపిన 6 గురు దుండగులు..

#yellow-alert #telangana-rains #heavy-rains #imd
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe