Telangana : హైదరాబాద్ (Hyderabad) లో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్,యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్ తదితర ప్రాంతంలో వర్షం దంచికొట్టింది. దీంతో రహదారుపై భారీగా వరద చేరింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాదారులు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది.
Also Read: ఔటర్‌పై మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి!
ఈ నేపథ్యంలో నీరు నిలిచిన ప్రాంతాలపై జీహెచ్‌ఎంసీ (GHMC) దృష్టి సారించింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవసరమైతేనే బయటికి రావాలని మేయర్ విజయ లక్ష్మీ సూచించారు. జీహెచ్ఎంసీ నుంచి సహాయం కావాలంటే 040-21111111, 9000113667 నెంబర్లకు కాల్ చేయాలని తెలపారు.