Weather Alert : భారీ వర్షాలు.. 11 మంది మృతి

కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు.

Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
New Update

Heavy Rains : ఓవైపు ఉత్తర భారత్‌ (North India) లో ఎండల తీవ్రత (Heat Waves) ఉండగా.. మరోవైపు దక్షిణాదన కేరళ (Kerala) లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో 11 మంది మృతి చెందినట్లు రెవెన్యూ శాఖ మంత్రి కె. రాజన్ వెల్లడించారు. మే 9 నుంచి 23 వరకు ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. 11 మందిలో ఆరుగురు నీటిలో గల్లంతై మరణించారని.. క్వారీ ప్రమాదంలో ఇద్దరు, పిడుగుపాటుకు గురై ఇద్దరు, ఇల్లు కూలి ఒకరు మృతి చెందారని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: ఇది సినిమా కాదు రియల్.. ఇలాంటి గ్యాంగ్ వార్ ఎక్కడా చూసి ఉండరు.. 

భారీ వర్షాల వల్ల ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, పాలక్కాడ్‌, మలప్పురం, కోజికోడ్‌, కొచ్చి తదితర నగరాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో శనివారం ఏడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert) ను జారీ చేసింది. కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులం, తిరువనంతపురం, కోజికోడ్‌, కాసర్‌గోడ్‌, కన్నూర్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ హెచ్చరికలు చేసింది. ఈ జిల్లాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Also Read: 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ విడుదల.. సెలవులు, పరీక్షలు ఎప్పుడంటే

#telugu-news #heavy-rains #weather-updates #kerala-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe