Kerala Football Stadium Fire Incident | గ్రౌండ్ లో బాంబుల మోత | Foot Ball Match | RTV
కేరళలో నిపా వైరస్‌తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందగా, ఆ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపించిందని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తెలిపింది. మలప్పురం జిల్లా బండికోడ్ కు చెందిన బాలుడికి గత జూన్ 14 లో నిపా వైరస్ సోకగా జూలై 21న మృతి చెందాడు.
వయనాడ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో చిక్కుకున్న గిరిజన కుటుంబాన్ని రెస్క్యూ టీం రక్షించింది. దాదాపు 5 రోజులుగా వాళ్లు తిండి లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ టీం వాళ్లను కాపాడిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బస్సులోనే గర్భిణికి ప్రసవం జరిగిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటినొప్పులు రావడంతో.. ఆ బస్సు డ్రైవర్ బస్సును వేరే మార్గంలోకి మళ్లించి ఆసుపత్రికి చేర్చాడు. సమయం లేకపోవడంతోనే వైద్య సిబ్బంది ఆమెకు బస్సులోనే డెలివరీ ఏర్పాట్లు చేశారు.
కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు.
కేరళకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా'తో మృతి చెందింది. కొన్నిరోజుల క్రితం చెరువులో స్నానానికి వెళ్లిన ఆ చిన్నారి అనారోగ్యానికి గురైంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఆమె మెదడుపై ప్రభావం చూపడంతో మృతిచెందిందని వైద్యులు తెలిపారు.
కేరళలోని కొచ్చిలో 23 ఏళ్ల ఓ ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తల్లిదండ్రలకు తెలియకూడదని శిశువును రోడ్డుపై విసిరేసింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. ఆమెపై విచారణ జరుపుతున్నారు.
కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. టికెట్ చూపించమని అడిగిన టీటీఈని రైలు నుంచి కిందకి తోసేశాడు. దీంతో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు టీటీఈని ఢీకొనడంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.