North India : గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) ఉత్తరాది రాష్ట్రాలు కకావికలం అవుతున్నాయి. వరదలు (Floods) జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, యూపీ, బీహార్, అస్సాం, మహారాష్ట్ర , జమ్మూ కశ్మీర్ , ఉత్తరాఖండ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమాన, రైల్వే, రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.
భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతుండటంతో సమీపంలోని ప్రజలు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. కొండ చరియలు (Cliffs) విరగడంతో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో అధికారులు సోమవారం ఓ జాతీయ రహదారితోపాటు 70కిపైగా రోడ్లను మూసేశారు. అస్సాంలో భారీ వర్షాల వల్ల కజిరంగా నేషనల్ పార్క్‌లోని 131 జంతువులు మృతి చెందగా, 96 జంతువులను కాపాడినట్లు అధికారులు వివరించారు.
జమ్ము కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మొఘల్ రోడ్డుపై భారీ కొండ చరియ విరగడంతో పూంఛ్, రాజౌరీ జిల్లాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా విమానాశ్రయంలో రన్‌వే ఆపరేషన్స్ దాదాపు గంటకుపైగా నిలిచిపోయాయి. 50 విమానాలను రద్దు చేశారు.
Also read: పిఠాపురం అభివృద్ధిపై సవాళ్ల పర్వం