Rains: వాన బీభత్సం.. నదులను తలపిస్తున్న రహదారులు..!
మహారాష్ట్రలో వాన బీభత్సం సృష్టిస్తోంది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పుణె, కొల్హాపూర్‌లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించి పోయింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.