Weather: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు..ఐఎండీ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలతో పాటూ 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి లిస్ట్‌ను విడుదల చేసింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Heavy Rain Alert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణశాఖ (IMD) భారీ వర్ష సూచన చేసింది. మొత్తం 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, ఒడిశాలో కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. బీహార్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.

దేశంలో మాన్‌సూన్‌ (Monsoon) సీజన్ ఆరంభం అయింది. అయితే కొన్నిచోట్ల వర్సాలు భారీగా పడుతుంటే..మరికొన్ని చోట్ల ఎండలు దంచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో (Telangana) అడపాదడపా వర్షాలు పడుతూ చల్లబడింది కానీ ఏపీలో (AP) మాత్రం ఇంకా ఎండలు దంచేస్తున్నాయి. అప్పుడప్పుడూ కాస్త వర్షం పడినా వేడి మాత్రం తగ్గడం లేదు. అలాగే ఢిల్లీ, హర్యానాల్లో కూడా ఎండలు మాడ్చేస్తున్నాయి. దీంతో ప్రజలు వేడితో అల్లాడిపోతున్నారు. మరోవైపు సిక్కింలో భారీ వర్షాలు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Also Read: కారు రివర్స్ చేస్తూ కొండ మీద నుంచి పడిపోయిన మహిళ

Advertisment
తాజా కథనాలు