Delhi: ఢిల్లీలో భారీ వర్షం..విమానాలు దారి మళ్ళింపు

భారీ వర్షం ఢిల్లీని మళ్ళీ ముంచెత్తింది. ఆగకుండా కురిసిన వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాలు వరద మయమయం అయ్యాయి. దీంతో రహదారులన్నీ నిండిపోయాయి. దాంతో పాటూ పలు విమానాలను కూడా దారి మళ్ళించారు.

New Update
Delhi: ఢిల్లీలో భారీ వర్షం..విమానాలు దారి మళ్ళింపు

Heavy Rain: మొన్నటికి మొన్న ఢిల్లీలో అతిపెద్ద వర్షం కారణంగా బేస్‌మెంట్‌లో నీళ్ళు నిండిపోయి ముగ్గురు విద్యార్ధులు చనిపోయారు. ఈరోజు మళ్ళీ నగరాన్ని అతిపెద్ద భారీ వర్షం ముంచెత్తింది. వర్షం నీటికి రహారులన్నీ చెరువులయ్యాయి. విమానాశ్రయం అంతా వర్షం నీటితో నిండిపోయింది. అనేక చోట్ల మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు తిరుగుతూ ఇబ్బంది పడ్డారు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్ (ఐటీఓ) జంక్షన్, కన్నాట్ ప్లేస్, మింటో రోడ్, మోతీ బాగ్ ఫ్లైఓవర్‌తో పాటు ట్రాఫిక్ జామ్‌లతో నిండిపోయాయి. దీంతో మింటో వంతెన కింద ఉన్న పాస్ మూసివేశారు. ఇక ఢిల్లీలోని మూడు నాలుగు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎవరికీ గాయాలు మాత్రంకాలేదని తెలుస్తోంది. ఇలాగే ఢిల్లీలో మరో రెండు గంటలపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

మరోవైపు వర్షం కారణంగా ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో , స్పైస్‌జెట్‌తో సహా పలు విమానయాన సంస్థలు తమ విమానాలను దారి మళ్లించాయి. వైబ్‌సైట్లలో వాటి స్టేటస్‌లను పెట్టామని.. ప్రయాణికులు చూసుకోవాలని సూచించారు. పూణే నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన UK998 విమానం లక్నోకు మళ్లించబడిందని విస్తారా తెలిపింది. అయితే ఎయిర్‌ఇండియా మాత్రం తన అతిథులకు విమానాశ్రయానికి త్వరగా బయలుదేరాలని సూచించింది.

మొన్న జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఈరోజు కురిసిన వర్షానికి ఢిల్లీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మరోసారి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీకుంటున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాలతో సహా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

Also Read:FOOD: మూడు నగరాల నుంచి అధికంగా వెజ్ ఆర్డర్లు-స్విగ్గీ

Advertisment
తాజా కథనాలు