Rahul Gandhi: లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత‌గా రాహుల్ గాంధీ !

పార్లమెంటులో విపక్ష నేతగా రాహుల్‌ గాంధీని ఎన్నికోవాలని ఎక్కువ మంది నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత శశి థరూర్‌ స్పందించారు. విపక్షనేతగా రాహుల్‌గాంధీని ఎన్నికోవాలనే డిమాండ్‌ను సమర్ధించారు.

New Update
Rahul Gandhi: లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత‌గా రాహుల్ గాంధీ !

లోక్‌సభ ఎన్నికల్లో 293 స్థానాల్లో గెలిచిన ఎన్డీయే కుటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. మరోవైపు 232 స్థానాల్లో గెలిచిన ఇండియా కూటమి తదుపరి కార్యాచరణలపై ప్రణాళికలు వేస్తోంది. అయితే పార్లమెంటులో విపక్ష నేతగా రాహుల్‌ గాంధీని ఎన్నికోవాలని ఎక్కువ మంది నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత శశి థరూర్‌ స్పందించారు. విపక్షనేతగా రాహుల్‌గాంధీని ఎన్నికోవాలనే డిమాండ్‌ను సమర్ధించారు. పలు ఇంటర్వ్యూలలో కూడా ఇదే డిమాండ్‌ను ముందుకు తీసుకొచ్చినట్లు గుర్తుకు చేశారు.

Also Read: ముగ్గురు బీజేపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు.. టీఎంసీ సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా రెండు సార్లు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టి.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా పర్యటించారని అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీకి సారధ్యం వహించే సత్తాను రాహుల్ సాధించారంటూ పేర్కొన్నారు. రాజ్యసభలో మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌సభలో రాహుల్‌గాంధీ నేతలుగా నాయకత్వం వహిస్తే పార్టీకి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నానని స్పష్టం చేశారు.

Also Read: ప్రధాని మోదీతో పవన్ ఫ్యామిలీ భేటీ

Advertisment
తాజా కథనాలు