War : డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) కెమెరా మ్యాన్ ఛోటా కె నాయుడు(Chota K Naidu) కి వార్నింగ్ ఇస్తూ లేఖ రాశారు. పదేళ్ళ కిందట తీసిని ఆరమయ్యా వస్తాయయ్యి సినిమా దగ్గర నుంచి ఇద్దరి మధ్యా వివాదం మొదలైంది. అయితే ఆ సినిమా గురించి తాను అప్పుడే వదిలేసినా ఛోటా కె నాయుడు వదిలేయడం లేదని హరీష్ శంకర్ అంటున్నారు. ఇప్పటికీ తన మీద అనవసరంగా మాటలు వదులుతున్నారని చెబుతున్నారు. ఈ పదేళ్ళల్లో ఛోటా కె నాయుడు 10 ఇంటర్వ్యూలు ఇస్తే తాను 100కు పైగా ఇచ్చి ఉంటానని.. అయినా తానెప్పుడూ అతని గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.
మీరంటే గౌరవం ఉంది..
ఛోటా కె నాయుడు అన్నా, ఆయన కెమెరా వర్క్ అన్నా తనకు ఎనలేని గౌరవం ఉందని చెబుతున్నారు హరీష్ శంకర్. అలాంటిది ఆయన అవసరం ఉన్నా లేకపోయినా తన గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ అడగకపోయినా కూడా ఛోటా కే నాయుడే తన ప్రస్తావన తీసుకువస్తున్నారని మండిపడ్డారు. రామయ్యా వస్తావయ్యే సినిమా అప్పుడే నాయుడుని తీసేయాలని చర్చ జరిగింది. కానీ దిల్ రాజు(Dil Raju) చెప్పాడనో, గబ్బర్ సింగ్ తర్వాత తనకు పొగరు ఎక్కువైందనో మిమ్మల్ని తీసేయలేదని గుర్తు చేశారు. ఏ రోజూ ఆయన మీద నింద వేయలేదని... అది తన వ్యక్తిత్వం కాదని.. అని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. ఇప్పుడు కూడా ఈ గొడవను ఇకకడితో వదిలేస్తే మంచిదని అంటున్నారు హరీష్ శంకర్. కాదు కూడదు అని కెలుక్కుంటే ఏ రోజైనా, ఏ ప్లేస్ అయినా గొడవకు తాను రెడీ అని చెప్పారు.
Also Read:Warning: మహేష్‌బాబు అడ్వర్టైజ్ చేస్తున్న మసాలాలు బ్యాన్..కాన్సర్ కారకాలే కారణం