Warning : మహేష్‌బాబు అడ్వర్టైజ్ చేస్తున్న మసాలాలు బ్యాన్..కాన్సర్ కారకాలే కారణం మీకు ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ మసాలాలు అంటే బాగా ఇష్టమా. మీ ఫుడ్‌లో వీటిని తెగ వాడేస్తున్నారా. మహేష్‌బాబు చెప్పాడు, పర్వాలేదు అని బిందాస్‌గా కూడా ఉన్నారు కదూ. కానీ తస్మాత్ జాగ్రత్త. వీటిని రెండు దేశాల్లో బ్యాన్ చేశారు. ఎందుకో తెలియాలంటే కింది ఆర్టికల్ చదివేయండి. By Manogna alamuru 21 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Everest MDH Masala : భారతదేశం(India) లో పాపులర్ మసాలా ప్రోడక్ట్ ఎవరెస్ట్(Everest Masala). కొన్నేళ్ళుగా భారతీయులు దీన్ని వాడుతున్నారు. దీని తరువాత ఎమ్‌డీహెచ్ మసాలు(MDH Masala) కూడా అంతే పాపులర్ అయింది.. మహేష్ బాబు(Mahesh Babu) లాంటి యాక్టర్లు సైతం ఎవరెస్ట్‌కు యాడ్స్ చేశారు. ఈ మసాలాలు దాదాపు అన్ని దేశాల్లోనూ లభ్యమవుతాయి. భారతీయులే కాక చాలా మంది విదేశీయులు కూడా వీటిని వాడుతున్నారు. ప్రముఖ చెఫ్‌లు సైతం ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ మసాలాలను రికమెండ్ చేస్తారు. అంతలా పాతుకుపోయాయి ఈ రెండు బ్రాండ్స్. అయితే తాజాగా ఈ రెండు బ్రాండ్స్‌లో కొన్ని మసాలాలను బ్యాన్ చేశాయి కొన్ని దేశాలు. బ్యాన్ చేసిన సింగపూర్, హాంకాంగ్.. సింగపూర్, హంగ్‌కాంగ్‌లు ఇప్పుడు ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ మసాలాలకు నో చెబుతున్నాయి. అవి మా దేశంలో తినడానికి అమ్మడానికి వీలు లేదని అంటున్నాయి. అయితే ఇందులో కూడా అన్ని మసాలాలను బ్యాన్ చేయలేదు. ఎవరెస్ట్‌లో ఫిష్ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌లో సాంబార్, మద్రాస్ కర్రీ పౌడర్, మిక్స్డ్ మసాలాలను మాత్రమే ఈ రెండు దేశాలు బ్యాన్ చేశాయి. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితికి మించి ఉందని అంటోంది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. ఇక ఎమ్‌డీహెచ్ మసాలాల్లో క్యాన్సర్ కారకాలున్నాయని చెబుతోంది హాంకాంగ్ ఫుడ్ ఏజెన్సీ. ఇధిలీన్ ఆక్సైడ్ గ్రూప్ 1 కార్సినోజెన్ గా వర్గీకరించారు. ఇది కాన్సర్ కారకమని వివరిస్తున్నారు. పురుగులను నివారించేందుకు ఇథలీన్ అక్సైడ్‌ను ఉపయోగిస్తారు. దీంతో వెంటనే ఈ నాలుగు ఉత్పత్తులను ఆపేయని ఆదేశించాయి సింగపూర్, హాంకాంగ్ దేశాలు. దాంతో పాటూ వీటిని రీకాల్ చేయాలని కోరాయి. శిక్ష కూడా పడుతుంది... పురుగులను నివారించేందుకు వినియోగించే ప్రోడక్ట్‌ను ఆహార పదార్ధాల్లో వినియోగించడం నేరమని అంటోంది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ(Singapore Food Agency). దీనికి శిక్ష కూడా ఉంటుందని తెలిపింది. 50 వేల డాలర్ల జరిమానా కానీ ఆరునెలల జైలు శిక్ష కానీ వేయొచ్చని తెలిపింది. దీని మీద సీఎఫ్‌ఎస్ పరిశోధనలు చేస్తోందని...అవి పూర్తయితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. సింగపూర్ ఆహార నిబంధనల ప్రకారం, ఇథిలీన్ ఆక్సైడ్‌ను "సుగంధ ద్రవ్యాల స్టెరిలైజేషన్‌లో ఉపయోగించవచ్చు, కానీ అది కూడా పరిమిత మోతాదులోనే. ఇథలీన్ అక్సైడ్ ఉన్న ఆహారాలు తినడం వలన తక్షణ ప్రమాదం లేనప్పటికీ దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిపింది. వీలయినంత వరకు ఇలాంటి వాటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తోంది సీఎఫ్‌ఎస్. Also Read:Jobs: ఇంటర్ పాసై ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్..8వేల ఉద్యోగాలను ప్రకటించిన రైల్వేస్ #singapore #hongkong #everest-masala #mdh-masala #ban మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి