Telangana: ఎంపీగా కేసీఆర్ పోటీ? హరీష్ రావు ఇంట్రస్టింగ్ కామెంట్స్..! పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రిపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఎంపీగా కేసీఆర్ పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. ఢిల్లీ పెద్దల పోటీపై స్పష్టత వచ్చాకే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. By Shiva.K 31 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Harish Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికలపై గురి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేలా ప్లాన్స్ వేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రిపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఆదివారం బీఆర్ఎస్‌ఎల్పీ ఆఫీసులో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు హరీష్ రావు. ఈ సందర్భంగా ఎంపీగా కేసీఆర్ పోటీ చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు హరీష్ రావు. ఢిల్లీ పెద్దల పోటీపై స్పష్టత వచ్చాకే తమ అభ్యర్థులను ప్రకటన ఉంటుందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. మార్చి 17వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు అవుతాయన్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాక ముందే పథకాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇక ప్రజాపాలన దరఖాస్తులపైనా విమర్శలు గుప్పించారు. ఇదంతా డ్రామా అని కొట్టిపారేశారు. గైడ్‌లైన్స్ ఇవ్వకుండానే అప్లికేషన్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక అప్పులపై మంత్రులు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు హరీష్ రావు. అప్పుల పేరుతో పథకాల దాటవేత, ఎత్తివేత, కోతకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ఆరోపించారాయన. ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆరు పథకాలు లేనట్లేనని అన్నారు. ఆ పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. రైతుబంధు ఎంతవరకూ ఇచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. మేడిగడ్డ, ప్రాణహితపై త్వరలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుందని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారని, మరి ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన పేరుతో ప్రోటోకాల్ తప్పుతారా? అని ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు హరీష్ రావు. ఓడిపోయిన వారి చేత రిబ్బన్ కటింగ్స్ చేయిస్తున్నారని విమర్శించారు. Also Read: మారి మంచిగ బతకండి.. రౌడీ షీటర్లకు కమిషనర్ కౌన్సిలింగ్! తాగి బయటకొచ్చారో తాట తీసుడే.. పోలీసుల మాస్ వార్నింగ్.. #brs #telangana-news #telangana #harish-rao #parliament-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి