TS Police: మారి మంచిగ బతకండి.. రౌడీ షీటర్లకు కమిషనర్ కౌన్సిలింగ్! రౌడీషీటర్లకు రాచకొండ సీపీ సుధీర్ బాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. గతాన్ని మరిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. మారిన రౌడీషీటర్లపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామన్నార. అవసరమైతే.. రౌడీషీట్‌ను కూడా ఎత్తేస్తామని చెప్పారు సీపీ సుధీర్ బాబు. By Shiva.K 31 Dec 2023 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: రాచకొండ సీపీ సుధీర్ బాబు.. రౌడీషీటర్లకు(Rowdy Sheeters) కౌన్సిలింగ్ ఇచ్చారు. మారేందుకు వారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. నేరప్రవృత్తిని వీడే వారికి ఆఫర్ ఇచ్చారు. నేరాలకు దూరంగా ఉంటూ.. మంచి ప్రవర్తన కలిగి ఉండే వారిపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని ఆఫర్ ఇచ్చారు సీపీ సుధీర్ బాబు(CP Sudheer Babu). భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండని రౌడీ షీటర్లకు హితవు చెప్పారు సీపీ సుధీర్ బాబు. ఆదివారం నాడు రాచకొండ కమీషనర్ క్యాంపు కార్యాలయంలో రౌడీషీటర్లలో మార్పు కోసం కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని రౌడీషీటర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు సీపీ. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సుధీర్ బాబు.. గతంలో నేరాలకు పాల్పడిన వారు.. నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, హుందాగా జీవించాలని సూచించారు. నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసినా.. వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రౌడీషీటర్లు తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని.. జీవితంలో మారాలని హితవు చెప్పారు. రౌడీషీటర్ అనే పదం తమ బిడ్డల భవిష్యత్‌ను కూడా నాశనం చేస్తుందన్నారు సీపీ. డాక్టర్ బిడ్డలు డాక్టర్స్ అవుతున్నారని, పోలీస్ ఆఫీసర్ పిల్లలు పోలీస్ ఆఫీసర్స్ అవుతున్నారని.. ఇదే మాదిరిగా రౌడీ షీటర్స్ పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్తులుగా తయారవుతారని పేర్కొన్నారు సీపీ. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీపీ సుధీర్ బాబు. రౌడీ షీటర్ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు సీపీ. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీట్ రికార్డ్‌లో వారు చేసే మంచి పనులు కూడా ఎంటర్ చేస్తామన్నారు. పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని చెప్పారు సీపీ. గతాన్ని మరిచిపోయి.. మారిన మనసుతో ముందడుగు వేయాలని కోరారు సీపీ సుధీర్ బాబు. Also Read: తాగి బయటకొచ్చారో తాట తీసుడే.. పోలీసుల మాస్ వార్నింగ్.. జూబ్లీహిల్స్‌లో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. తొలిసారి బ్రౌన్‌షుగర్ పట్టివేత.. #hyderabad #rachakonda-police #telangana-news #cp-sudheer-babu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి