రోహిత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా జౌట్?

ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. హార్డిక్ పాండ్యా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కాబోతున్నట్లు నెట్టింట చర్చ నడుస్తోంది. గాయం తీవ్రత పెరగడంతో అప్ఘాన్ సీరిస్ తో పాటు ఐపీఎల్ ఆడకపోవచ్చని బోర్డ్ సభ్యులు తెలిపినట్లు వార్తలొస్తున్నాయి.

New Update
రోహిత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా జౌట్?

MI : ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్సీ ఇష్యూతో ముంబై ఫ్యాన్స్ డిజప్పాయింట్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా మరోస్టార్ ప్లేయర్ ఈసారి ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ లో గాయపడిన ఆల్ రౌండర్ ఇంకా కోలుకోకపోవడంతో సౌత్ ఆఫ్రికా టూర్ కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే త్వరలోనే ఆఫ్ఘానిస్తాన్ తో సిరీస్ కూడా అతను ఆడే అవకాశం లేదని, ఐపీఎల్ కూడా అందుబాటులోకి రావడం కష్టమేనని బోర్డ్ మొంబర్స్ వెల్లడించినట్లు నెట్టింట చర్చ నడుస్తోంది.

ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) టీమ్ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. రోహిత్ శర్మ(Rohit Sharma) ను కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించి అతని ప్లేస్ లో హార్దిక్‌ పాండ్యను రిజర్వ్ చేయబోతున్నట్లు ముంబై యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఆ టీమ్ లో ఉన్న సీనియర్ ప్లేయర్స్ సూర్య కుమార్ యాదవ్, జస్ర్పిత్ బూమ్రా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు కొంతమంది ఫ్యాన్స్ సైతం హార్దిక్ కెప్టెన్సీ ఇవ్వడంపై ఫైర్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) ఆడటం కష్టంగానే కనిపిస్తోందని, గాయం తగ్గకపోవడంతో సెలక్టర్లు రెస్ట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని, త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : ‘ఫైటర్’లో రెచ్చిపోయిన దీపిక.. బీచ్ లో అరాచకమే చేసిందిగా!

'2023 వరల్డ్‌ కప్‌లో గాయపడిన హార్దిక్ సౌత్ ఆఫ్రికా టూర్ కు దూరమయ్యాడు. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌ నాటికి ఫిట్ అవుతాడని అంతా భావించాం. కానీ గాయం తీవ్రత కారణంగా ఆ సిరీస్‌లో పాల్గొనడం కష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు 2024 ఐపీఎల్‌ సీజన్ కూడా ఆడటం కష్టమే అనిపిస్తోంది. హార్డిక్ విషయంలోనూ బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు' అని బోర్డు సభ్యులు సన్నిహితులతో చెప్పినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక ఇదిలావుంటే.. ఐపీఎల్‌ అయిపోగానే టీ20 ప్రపంచ కప్‌ మొదలు కానుండగా కెప్టెన్సీ బాధ్యలపై చర్చ నడుస్తోంది. హార్డిక్ దూరమైతే రోహిత్ మళ్లీ భారత జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. కానీ రోహిత్ ఇందుకు ఆసక్తిగా కనిపించట్లేదు. ఈ క్రమంలో అఫ్ఘాన్ సిరీస్ కు జస్‌ప్రీత్ బుమ్రా లేదా సూర్యకుమార్‌ యాదవ్‌లో ఒకరిని కెప్టెన్‌గా నియమించబోతున్నట్లు బోర్డులో చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సౌత్ ఆఫ్రికా పర్యటన ముగియగానే అధికారిక ప్రకటన రానుంది.

ఇదిలావుంటే.. హార్దిక్ ఐపిల్ దూరం కాబోతున్నాడనే వార్తలపై కొంతమంది ముంబై, హార్దిక్ ఫ్యాన్స్ కలవరపడుతుంటే మరికొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతనివల్లే ముంబై ఇండియన్స్ టీమ్స్ అసంతృప్తితో ఉందని, ఎప్పుడూ గాయపడే హార్దిక్ కు కెప్టెన్సీ అవసరమా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం.. 'హార్దిక్ గాడికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వకూడదు. వాడు మళ్లీ గాయపడితే బాగుండు. హార్ట్ స్ట్రోక్ తో చస్తే బాగుండు' అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు