Hamas:మరో ఇద్దరు బందీలను విడిచిపెట్టిన హమాస్

హమాస్ మిలిటెంట్లు మరో ఇద్దరు బందీలను విడుదల చేసారు.ఈజిప్ట్-ఖతార్ మధ్యవర్తిత్వం తర్వాత మానవతా దృక్పథంతో ఇద్దరు వృద్ధ మహిళలను విడుదల చేసినట్లు హమాస్ ప్రకటించంది. మిలిటెంట్ల చేతిలో మొత్తం 222 మంది బందీలుగా ఉన్నారు.

New Update
Hamas:మరో ఇద్దరు బందీలను విడిచిపెట్టిన హమాస్

16 రోజులుగా ఇజ్రయెల్-హమాస్ ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ముందు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అప్పుడు 222 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్ళారు. గాజాలో ఎక్కడో వారిని దాచిపెట్టారు.అప్పటి నుంచి గాజా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తమ వారిని రక్షించుకునేందుకు ఎన్ని రోజులు అయినా పోరాడుతామని చెబుతోంది ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం. మరోవైపు హమాస్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకపక్క వేలల్లో పాలస్తీనియన్లు చనిపోతున్నా తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టడం లేదు. దాడులు ఆపితే బందీలను విడిచిపెడతామని హమాస్ చెబుతుంటే...ముందు బందీలను రిలీజ్ చేయండి...దాడులు ఆపుతామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది.

Also Read:రాజగోపాల్ రెడ్డి రాజకీయం స్టైలే వేరయా!

అయితే గత నాలుగు రోజుల్లో హమాస్ ఇద్దరు ఇద్దరు చొప్పున నలుగురు బందీలను విడిచిపెట్టింది. ముందు ఇద్దరు అమెరికన్ తల్లీకూతుళ్ళను రిలీజ్ చేయగా తాజాగా నిన్న రాత్రి మరో ఇద్దరు వృద్ధ మహిళలను రిలీజ్ చేసింది హమాస్. ఇక అమెరికా ఇరు దేశాల మధ్య సంధి కుదర్చడానికి తెగ ప్రయత్నిస్తోంది. హమాస్ చెర నుంచి బందీలను విడిపించేందుకు, వారితో చర్చలు జరిపేందుకు గ్రౌండ్ యాక్షన్ ను కొంతకాలం విరమించాలని సూచించింది. అలాగే గాజాకు మానవతా సాయం అందించేందుకు కూడా అనుమతినివ్వాలని ఐరాసతో పాటూ ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్ సైన్యం కొన్ని గంటల పాటూ రఫా సరిహద్దులను తెరిచింది. దీని ద్వారా నిత్యావసరాలతో ఉన్న ట్రక్కులు కొన్ని గాజాలోకి ప్రవేశించాయి.

మరోవైపు గాజాలో చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు రోజురోజుకూ ఎక్కువ అవుతుండడంతో గాజాలో మహిళలు, చిన్నారులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 5,087 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో 2,055 మంది చిన్నారులు ఉన్నారు. 1,119 మంది మహిళలు కూడా మృతి చెందారు. ఇది కాక 15వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.

ఇక గాజాలో కరెంట్ లేక చాలా మంది అవస్థలు పాలవుతున్నారు. అక్కడ ఆసపత్రల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల గురించి ఎన్ఐసీయూ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే నిమిషాల్లో అందులో ఉన్న పిల్లలు అందరూ చనిపోతారని డాక్టరు చెబుతున్నారు. ఈ కేర్ యూనిట్ కు వెంటనే వైద్య సామాగ్రిని పంపించాలని కోరుతున్నారు. గాజాలో అల్ షిఫా ఆసుపత్రిలో ఇంక్యుబేటర్ లె మొత్తం 55 మంది పిల్లలు ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు