Bomb attack on hospital:ఆసుపత్రిపై దాడి మిలిటెంట్ల పనే- ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు గాజాలో ఆసుపత్రి దాడిలో 500 మంది అక్కడిక్కడే చనిపోయారు. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్టే గురితప్పి ఆ దారుణం జరిగిందని ఇజ్రాయెల్ అంటోంది. ఇది కచ్చితంగా ఉగ్రమూకల దుశ్చర్యే అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 18 Oct 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గాజాలో ఆసుపత్రి దారుణానికి కారణం హమాస్ రాకెట్ల ప్రయోగమే అని అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. మా పౌరులను, పిల్లలను దారుణంగా చంపిన మిలిటెంట్లు ఇప్పుడు వారి పిల్లలనే చంపుకుంటున్నారు అని విమర్శించారు. గాజాలో ఆసుపత్రి దాడి మీద ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇదే మాట అంటోంది. ఆసుపత్రి దగ్గరలో పీఐసే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ గురితప్పి హస్పటల్లో పేలుడు జరిగిందని చెబుతోంది. దీనికి సంబంధించి ఐడీఎఫ్ తన ఎక్స్ ఖాతాతో వీడియోలు, పోస్ట్ లు పెట్టింది. This is the tragic result of firing rockets from densely populated neighborhoods. pic.twitter.com/7iAxwLUQzV — Israel Defense Forces (@IDF) October 18, 2023 మరోవైపు ఆసుపత్రిలో పేలుడు మీద ఐక్యరాజ్యసమితితో పాటూ అగ్రదేశాలు అన్నీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. పశ్చిమ దేశాల పర్యటనలో ఉన్న జో బైడెన్ దీని మీద స్పందించారు. విషయం తెలియగానే జోర్డాన్ రాజు అబ్దుల్లా2, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడినట్లు తెలిపారు. ఇక ఈ దాడి వలన బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దయింది. అంతకు ముందు జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్టు ప్రధాని ఎల్-సీసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్ మూద్ అబ్బాస్ లు బైడెన్ ను కలవడానికి నిరాకరించారు. ఇప్పుడు దాడి కూడా జరగడంతో పర్యటన రద్దయిందని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ పర్యటన మాత్రం కొనసాగుతోంది. Also Read:మళ్ళీ డౌన్‌లోకి వచ్చేసిన స్టాక్ మార్కెట్స్ దాడులను ఆపితే బందీలను వదిలేస్తాం.. ఇప్పటివరకు ఇప్పొక లెక్క అన్నట్టు తయారయ్యింది ఇజ్రాయెల్-హమాస్ వార్. పదిరోజులుగా యుద్ధం జరుగుతోంది. అన్నిటికంటే నిన్న జరిగిన ఆసుపత్రి ఘటన అన్నింటికంటే దారుణం. ఈ దాడిలో ఒకేసారి 500వందల మంది పాలెస్తీనియన్లు చనిపోయారు. దెబ్బలు తగిలిన వారి ఆర్తనాదాలతో, ఏడుపులతో గాజానగరం దద్దరిల్లిపోతోంది. ఇరు వర్గాల మధ్య పోరు భీకరంగా మారుతోంది. ఆసుపత్రి దాడిని పాలస్తీనా అధికారులు ఊచకోతగా అభివర్ణిస్తున్నారు. ఇందులో చనిపోయిన వారికోసం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించారు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్. ఈ మారణహోమాన్ని ఆపాలని అబ్బాస్ కోరుతున్నారు. అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని దీన్ని ఆపాలని ఆయన కోరారు. అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తమ దగ్గర ఉన్న ఆ దేశ బందీలను విడిచిపెట్టేస్తామని హమాస్ చెబుతోంది. హమాస్ కు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ ప్రకటనను చేసినట్లు స్థానికి మీడియా చెబుతోంది. దాడులను ఆపిన గంటలోనే బందీలను విడిచిపెట్టేస్తామని చెప్పారు. ప్రస్తుతం వారిని విడిచి పెట్టేందుకు సురక్షితమైన ప్రదేశం లేదని తెలిపినట్టు సమాచారం. అయితే హమాస్ అధికారి ఎవరనేది మాత్రం తెలియలేదు. హమాస్ దగ్గర దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. #attack #israel #hamas #gaza #palestina మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి