Israel-Hamas war:గాజా మీద హమాస్ పట్టుకోల్పోయింది-ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

New Update
Israel-Hamas war:గాజా మీద హమాస్ పట్టుకోల్పోయింది-ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

యుద్ధం మొదలై చాలా రోజులు అవుతున్నా...అమాయక ప్రజలు ప్రాణాలు పొగొట్టుకుంటున్నా హమాస్, ఇజ్రాయెల్ రెండూ వెనక్కి తగ్గడం లేదు. హమాస్ తమ దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టడం లేదు. గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. వైమానిక, భూదాడులను కూడా చేస్తూ గాజాను ఆక్రమించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ గాజాలో హమాస్ నియంత్రణ కోల్పోయింది అని వ్యాఖ్యానించారు. హమాస్‌ ఉగ్రవాదులు దక్షిణం వైపుకు పారిపోతున్నారని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఆధారానలు మాత్రం ఆయన చూపించలేదు. యోవ్ గల్లంట్ వ్యాఖ్యలు ఇజ్రాయెల్ ప్రధాన టీవీ స్టేషన్లలో అన్నింటిలో ప్రసారమైంది.

Also Read:సెమీస్‌కు స్పెషలిస్ట్ స్పిన్నర్ వచ్చేస్తున్నాడు..రేపటి భారత తుది జట్టు ఇదే..

మరోవైపు పాలస్తీనాలోని మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ కీలక ప్రకటన చేసింది. తమ దగ్గర బందీలుగా ఉన్నవారిలో 70 మంది మహిళలు, చిన్నారుల్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఐదు రోజులపాటు యుద్ధాన్ని నిలిపివేయాలని షరతు విధించింది. అంతేకాక గాజాస్ట్రిప్‌లోని అన్ని ప్రాంతాల్లో మానవతా సాయానికి అనుమతించాలి అని హమాస్‌ ప్రతినిధి అబు ఉబైదా పేర్కొన్నారు. ఇక బందీలను విడిపించుకోవడానికి ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్టు సూచనప్రాయంగా చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అమెరికా మీడియాతో మాట్లాడుతూ...నేను ఒప్పందం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అది కార్యరూపం దాల్చడానికి అంత అవకాశం ఉంటుంది అంటూ ఆయన తెలిపారు.

ఇవన్నీ ఇలా కొనసాగుతుంటే...గాజాలోని అతి పెద్ద అల్‌-షిఫా ఆసుపత్రి కేంద్రంగా ఇజ్రాయెల్‌ దళాలకు, హమాస్‌ మిలిటెంట్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. దీంతో ఆసుపత్రి లోపల కరెంట్ లేక చీకట్లో రోగులు నానా అవస్థులుపడుతున్నారు. దీనివల్ల అక్కడ ఉంటున్న వందల మంది శిశువులు మరణించే అవకాశం ఉందని చెబుతున్నారు ఆసుపత్రి అధికారులు. శనివారం నాటికి ఆసుపత్రిలోని చివరి జనరేటర్‌ పనిచేయడం మానేసింది. దీంతో ముగ్గురు శిశువులు, నలుగురు ఇతర రోగులు మరణించారు. మరో 36 మంది శిశువులు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. అల్‌-షిఫా ఆసుపత్రిలో 1500 మంది రోగులు, 20 వేల వరకు శరణార్ధులూ ఉన్నారు. ఇజ్రాయెల్ హెచ్చరికలతో చాలా మంది బయటకు వెళ్ళిపోయారు, కానీ ఇంకా 2500మంది మాత్రం లోపలే ఉండిపోయారు.

Advertisment
తాజా కథనాలు