Israel-Hamas war: ఆస్పత్రి కింద హమాస్ బంకర్లు..గుర్తించిన ఐడీఎఫ్

గాజాలో ఇళ్ళు, ఆస్పత్రుల కింద హమాస్ స్థావరాలున్నాయని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెబుతోంది. దానికి నిదర్శనంగా ఈరోజు ఓ వీడియోను పోస్ట్ చేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ టన్నెల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

New Update
Israel-Hamas war: ఆస్పత్రి కింద హమాస్ బంకర్లు..గుర్తించిన ఐడీఎఫ్

గాజాలో అణువణువూ హమాస్ స్థావరాలే. సామాన్య ప్రజల ఇళ్ళు, ఆస్పత్రులను సైతం తమ బంకర్ల కింద మార్చుకుంది హమాస్. వీటిని కనిపెట్టడం కూడా పెద్ద టాస్కే. ఆసుప్రతిలో సొరంగం ఉంటుందని ఎవరు ఊహిస్తారు. అయితే ఈ విషయం గురించి ఇజ్రాయెల్ సైన్యం ఎప్పటి నుంచో చెబుతోంది. తాజాగా ఇప్పుడు దానికి నిదర్శనం కూడా చూపెడుతోంది. గాజాలో పోరు సాగిస్తున్న ఐడీఎఫ్‌ సేనలు.. హమాస్‌కు చెందిన ఓ సొరంగాన్ని గుర్తించాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌తో పటిష్టంగా ఉన్న ఆ టన్నెల్‌.. ఓ ఆసుప్రతి నుంచి ఉంది. అది కూడా చిన్నారుల ఆసుపత్రి. దీని కింద ఉన్న హమాస్‌ కమాండ్‌ సెంటర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

Also Read:హిజాబ్ గొడవలను మళ్ళీ తెర మీదకు తీసుకువస్తున్న కర్ణాటక ఎగ్జామినేషన్‌ అథారిటీ

ఈ ఆస్పత్రి కూడా అక్టోబర్ లో దాడి చేసిన నేవీ ఆపరేషన్ కమాండర్ ఇంటికి దగ్గరలో ఉంది. ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హంగరీ ఈ సొరంగాన్ని చూపిస్తూ డీటెయిల్డ్ వీడియో చేశారు. సోలార్ ప్యానెళ్ళతో ఈ బంకర్ కు విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. అలాగే దీనికి బుల్లెట్ ప్రూఫ్ డోర్ కూడా ఉందని డేనియల్ చెప్పారు. టన్నెల ఒక చివర గాజాలోని అల్ రాంటిస్ ఆస్పత్రి బేస్ మెంట్ ఉంది. వార్ కు ముందు ఈ ఆస్పత్రిలో చిన్నారులు, కాన్సర్ రోగులకు చికిత్స అందించేవారు.

ఈ బేస్‌మెంట్ వద్ద హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ ఉంది. అందులో రాకెట్‌ ప్రొపెల్ల్‌డ్‌ గ్రనేడ్లు, రైఫిళ్లు, ఆత్మాహుతి దాడులకు ఉపయోగించే బాడీ వెస్ట్‌లు, ఇతర పేలుడు పదార్థాలను డేనియల్ గుర్తించారు. అలాగే హమాస్ కిడ్నాప్ చేసిన ఇజ్రాయెల్ పౌరులను కూడా కొంతకాలం ఇక్కడ బందీలుగా ఉన్నట్లు గుర్తించారు.దీనికి సంబంధించి సొరంగంలో తాము కొన్ని ఆధారాలను కూడా చూపించారు.

ఈ టన్నెల్‌లో ఓ బైక్‌ ఉంది. దానికి బుల్లెట్‌ తగిలిన గుర్తులున్నాయి. అలాగే ఇక్కడ మహిళల దుస్తులు, కుర్చీలకు కట్టిన తాళ్లు కన్పించాయి. డైపర్లు, చిన్నారుల ఫీడింగ్‌ బాటిళ్లు కూడా ఉన్నాయి. వీటిని చూస్తుంటే బందీలను కొంతకాలం ఇక్కడ ఉంచినట్లు తెలుస్తోంది అంటున్నారు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియెల్. అంతేకాదు.. ఇక్కడ ఓ క్యాలెండర్‌ ఉంది. అందులో అక్టోబరు 7 నుంచి తేదీలను మార్క్‌ చేసి ఉంచారు అని డేనియల్‌ ఆ వీడియోలో చెబుతున్నారు.

ఇక మరోవైపు గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. దీంతో ఆస్పత్రి దగ్గర పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. కరెంట్ లేకపోవడంతో అక్కడ ఉన్న చిన్నారులు, రోగులు నానాపాట్లు పడుతున్నారు. చాలా మంది పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దీని మీద ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణమే ఇజ్రాయెల్ అక్కడ దాడులు ఆపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు