Nirmal: ఎడారిలో అవస్థలు పడుతున్నా.. గల్ఫ్ వాసి ఆవేదన..

నిర్మల్ జిల్లా వాసి ఉపాధి కోసం కువైట్‌ వెళ్లీ తీవ్ర అవస్థలు పడుతున్నానని ఓ వీడియో చిత్రీకరించాడు. ఇంట్లో పని అని చెప్పి ఏజెంట్‌ నమ్మించాడని.. అక్కడికి వెళ్లాక ఎడారిలో ఒంటెల కాపరిగా పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను స్వదేశానికి రప్పించాలంటూ సీఎం రేవంత్‌ను వేడుకున్నాడు.

Nirmal: ఎడారిలో అవస్థలు పడుతున్నా.. గల్ఫ్ వాసి ఆవేదన..
New Update

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని చెబుతూ వీడియోలు రిలీజ్ చేసేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా నిర్మల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం కువైట్‌ వెళ్లీ తీవ్ర పడుతున్నానని ఓ వీడియో చిత్రీకరించాడు. తనను స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను వేడుకున్నాడు.

Also Read: వయనాడ్‌ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్ గాంధీ

ముథోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి 10 నెలల క్రితమే కువైట్‌కు వెళ్లాడు. ఏజెంట్ ఇంట్లో పని అని చెప్పి ఏజెంట్‌ నమ్మించాడని.. అక్కడికి వెళ్లాక ఎడారిలో ఒంటెల కాపరిగా పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను యజమానులు కొడుతున్నారంటూ వీడియోలో వాపోయాడు. తనను కాపాడాలని ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను అభ్యర్థించాడు.

#telugu-news #kuwait #desert #nirmal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe