MI vs GT: పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి రోహిత్..! హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఎమోషనల్! ఇన్నాళ్లు ముంబై జట్టును ముందుండి నడిపించిన రోహిత్ ఈ సారి పాండ్యా కెప్టెన్సీలో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇవాళ గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఉండగా.. ఈ గేమ్‌లో రోహిత్ చెలరేగి ఆడి, విమర్శకుల మూతి మూయించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. By Trinath 24 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL 2024: ఈ సారి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ భిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రతీఏడాది ఐపీఎల్ స్టార్ట్ అవుతుందంటే అందరూ ఏకమైపోతారు. ముంబై జట్టును తమ సొంత కుటుంబంగా భావిస్తారు. తమ ఫ్రాంచైజీని ప్యూర్ హార్ట్‌తో ప్రేమించే వారిలో ముంబై ఫ్యాన్స్ ప్రత్యేకం. అయితే ఏ ఫ్యామిలీలోనైనా గొడవలు సాధారణమైనట్టే ముంబై కుటుంబంలోనూ వేరుకుంపట్లు ఏర్పడ్డాయి. గుజరాత్‌ను ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడమే దీనికి ప్రధాన కారణం. ముంబై జట్టుకు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన రోహిత్ స్థానంలో పాండ్యాని కెప్టెన్‌గా నియమించడం హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు మింగుడుపడలేదు. అయితే చివరకు ఫ్యాన్స్ కాంప్రమైజ్ అయ్యారు. వారి అలక కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. ఐపీఎల్-17 ఎడిషన్‌లో ఇవాళ సాయంత్రం 7:30 నిమిషాలకు గుజరాత్ వర్సెస్ ముంబై మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్. బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలి: ఇన్నాళ్లు ముంబై జట్టును ముందుండి నడిపించిన రోహిత్ ఈ సారి పాండ్యా కెప్టెన్సీలో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. రోహిత్ ఓ సాధారణ ప్లేయర్‌గా ఆడనుండడంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అయితే రోహిత్ అద్భుతంగా ఆడాలని.. సిక్సులు కొట్టాలని కోరుకుంటున్నారు. రోహిత్ బాగా ఆడితే అది అంబానీ ఫ్రాంచైజీకి చెంపపెట్టులా అవుతుందని ఆశిస్తున్నారు. రోహిత్ తన బ్యాట్‌తోనే అందరికి సమాధానం చెప్పాలంటున్నారు. అందుకే ఇవాళ జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక టీమ్ అంచనా ఎలా ఉంటుందో ఓ లుక్కేయండి. జట్లు అంచనా: గుజరాత్ టైటాన్స్ ఒకవేళ ముందు బ్యాటింగ్ చేయాల్సి వస్తే - శుభమాన్ గిల్ (సి), వృద్ధిమాన్ సాహా (డబ్ల్యూకే), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే - శుభమాన్ గిల్ (C), వృద్ధిమాన్ సాహా (WK), అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ/ R సాయి కిషోర్ ముంబై ఇండియన్స్ ఒకవేళ ముందు బ్యాటింగ్ చేయాల్సి వస్తే - రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (C), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే - రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (C), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార Also Read: విశాఖ క్రికెట్ లవర్స్‌కు అలెర్ట్.. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే! #mumbai-indians #rohit-sharma #cricket #hardik-pandya #ipl-2024 #gujarat-titans మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి