2 Guarantees : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మరో రెండు పథకాల గృహజ్యోతి(Gruha Jyothi), 500రూ.లకే గ్యాస్ లను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ రెండు పథకాలు ఈరోజు రంగారెడ్డి చేవెళ్ళ(Chevella) లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దీనికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(Mahbubnagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఈసీ నిన్న విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని షాద్ నగర్ ప్రాంతం.. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కలిసింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో కూడా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం రెండు పథకాలను సచివాలయంలోనే నిర్వహించనున్నారు. గృహజ్యోతి, 500రూ.లకే గ్యాస్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత.. ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అయితే ఆమె వీటిని వర్చువల్‌గా స్టార్ట్ చేయనున్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం..
మార్చి 1 నుంచి ఈ రెండు పథకాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. గృహజ్యోతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం షరుతులు వస్తాయని చెబుతోంది. అందులో గత ఏడాది వాడిన కరెంట్‌కు 10 శాతం ఉచిత కరెంట్ కింద ఇస్తామని తెలిపింది. దాంతో పాటూ నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితి దాటని వారికే పథకం అమలు వర్తిస్తుందని చెబుతోంది. నెల వినియోగం 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు తెల్లరేషన్ కార్డు(White Ration Card) ఉన్నవారే పథకానికి అర్హులు అని కూడా చెబుతోంది. రేషన్‌కార్డు ఆధార్‌తో లింకై ఉండాలని తెలపింది. ఈ నిబంధనలు అన్నీ ఉన్నవారికే గృహజ్యోతిని ఇస్తామని స్పష్టం చేసింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే అర్హులకు మాత్రం జీరో బిల్లులు వేయనున్నారు.
500రూ.లకే గ్యాస్..
ఇక ఎల్పీజీ సిలిండర్(LPG Cylinder) తక్కువ ధరకే పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. ఇంకా గ్యాస్ బాండ్ అవసరం. గ్యాస్ సిలిండర్ పాస్ బుక్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వారికే ఈ స్కీం కింద ప్రయోజనం పొందుతారు. అయితే లబ్దిదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రం ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో సొమ్మును డిపాజిట్ చేస్తుంది. ఉదాహరణకు.. సిలిండర్ ధర రూ.955 ఉంటే లబ్ధిదారుడు రూ.955 చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.40 మినహాయించి.. మిగతా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తుంది.
Also Read : Rajya Sabha:ఈరోజే రాజ్యసభ ఎన్నికలు..12 రాష్ట్రాల అభ్యర్ధులు ఏకగ్రీవం