మూడు రోజుల క్రితం భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాన మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్యా 10 ఒప్పందాలు ఖరారయ్యాయి. అందులో గంగా, తీస్తా జలాల అంశం కూడా ఉంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య 2026లో ముగిసిపోనున్న గంగా నదీ జలాల పంపక ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ఈ ఒప్పందంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతర తెలిపారు. బంగ్లాదేశ్‌కు భారత్‌కు మధ్య జరిగిన జల ఒప్పందంలో పక్కనే ఉన్న, దానితో అన్నీ పంచుకుంటున్న పశ్చిమబెంగాల్‌ను చర్చలో భాగస్వామ్యం చేయకపోవడం ఆమోదం కాదని ఆమె అన్నారు. ఈ జల ఒప్పందం వలన బెంగాల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మమతా అన్నారు. ఈ జల ఒప్పందానికి సంబంధించి మమతా పరధాని మోదీకి లేఖ రాశారు. ఇండో- బంగ్లా రైల్వేలైను, బస్ సర్వీస్ లాంటి పలు ఒప్పందాలకు పశ్చిమ బెంగాల్ సహకరించింది. కానీ ఇప్పుడు ప్రజలకు, వారి మనుగడకు అవసరమైనటు వంటి విషయంలో మత్రం రాజీ పడేదిలేదని అని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు.
ఇక తీస్తా జలాల పంపకం విషయానికి వస్తే ఇప్పటికే ఈ నదీ జలాలను పంచడం వలన.సిక్కింలో జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులకు ఎగువన ఉన్న పరీవాహక ప్రాంతంలో అటవీ నిర్మూలన కారణంగా ఇప్పటికే నది మనుగడ చిక్కుల్లో పడిందని మమతా బెనర్జీ చెప్పారు. మన దేశం నుంచి బంగ్లాదేశకు వెళుతున్న ఆ నదిలో ఇప్పుడు నీళ్ళు కూడా అంతగా ఉండటం లేదని చెప్పారు. నార్త్ బెంగాల్ ప్రాంతంలోని ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే.. తీస్తా నదిపై ప్రాజెక్టుకు బంగ్లాదేశ్‌కు సహకరిస్తామని ప్రకటించడం భావ్యం కాదన్నారు. ప్రాని మోదీ దీని విషయంలో జల ఒప్పందం ఎలా చేసుకుంటారని దీదీ అడిగారు.
Also Read:Kerala: కేరళంగా మారునున్న కేరళ..అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం