/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/good-to-drink-fenugreek-water-daily-in-summer-2-jpg.webp)
Fenugreek Water Benefits : వేసవి(Summer) లో మెంతి నీరు(Fenugreek Water) తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో వేడిని అదుపులో ఉంచుతుందని చెబుతారు. రోగనిరోధక శక్తి(Immunity Power) ని పెంచడం నుంచి బరువు తగ్గడం(Weight Loss) వరకు మెంతి నీరు శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వేసవిలో మెంతి నీళ్లు తాగడం సరైనదేనా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది.
వేసవిలో తాగవచ్చా..?
మెంతులు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వేసవిలో దీనిని తాగడం వల్ల శరీరానికి హాని జరుగుతుందని నిపుణులు అంటుంటారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని, కాబట్టి వేసవిలో దీనిని తాగకూడదని నిపుణులు అంటున్నారు.
ఇలా చేస్తే వేడి పెరగదు:
మెంతులు వేడిగా ఉంటాయి. కానీ రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచితే అది శరీరంలో వేడిని పెంచదని నిపుణులు అంటున్నారు. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచడానికి పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది మొలకెత్తిన మెంతులు సైతం తింటున్నారు.
వేడిని తగ్గిస్తుందా..?
మెంతి నీళ్లలో విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దీనిని తాగడం వల్ల ఎటువంటి హాని ఉండదని, శరీరంలోని వేడిని తగ్గిస్తుందని అంటున్నారు.
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది:
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో మెంతులు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగితే మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు మంట వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
డ్రింక్ ఎలా చేసుకోవాలి..?
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మెంతి గింజలను కలపండి. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నీటిని వడపోసి మరో పాత్రలో తీసుకోవాలి. విత్తనాలను నేరుగా కూడా తినవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగవచ్చు. ఉదయం ఒక పాన్ తీసుకుని అందులో మెంతి గింజలను కలపాలి. ఆ తర్వాత 2-3 నిమిషాలు ఉడికించాలి. దాన్ని టీ లాగా కూడా తాగవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ మూడు అలవాట్లు ఉంటే మీ భాగస్వామికి ఎప్పుడూ మీపై కోపం రాదు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.