Jagan Sarkar : సంక్రాంతి(Sankranti) పండగ కన్నా ముందే చిరు వ్యాపారుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని డిసైడ్ అయింది ఏపీ(AP) లోని జగన్ సర్కార్(Jagan Sarkar). వారు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి అండగా నిలబడుతూ.. వారి ఇంట ముందుగానే పండగ సంతోషాలు వెల్లివిరిసేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోంది. దీనిలో భాగంగా చిరు వ్యాపారులకు 10వేల అర్ధిక సాయాన్ని అందిస్తోంది.
3,95,000 చిరు వ్యాపారులకు(Small Traders) రూ. 417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలు ఇస్తోంది ప్రభుత్వం. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ కలిపి.. మొత్తం రూ. 431.58 కోట్లను జమ చేయనున్నారు. ఇవాళ తాడేపల్లి(Tadepalle) ల్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
Also Read : 13 దేశాల ప్రతినిధులకు విందు ఇచ్చిన సీఎం రేవంత్.. పెట్టుబడులకు ఆహ్వానం
ఈ పథకానికి 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు అర్హులు. తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు.. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. అంతేకాదు గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు.. చేనేత, సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిరువ్యాపారులు కూడా ఇందుకు అర్హులు.
చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి ఏటా రూ.10,000 రుణం సున్నా వడ్డీకే అందిస్తోంది ప్రభుత్వం. రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించినవారికి ఆ రూ.10,000కు అదనంగా ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నారు. ఇవాళ అందిస్తున్న వడ్డీ రీయింబర్స్ మెంట్ రూ. 13.64 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు మన ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు.
Also Read : BIG BREAKING: ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ?