Ap Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!

ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

New Update
ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోమో స్పష్టత ఇస్తాం: నాదెండ్ల మనోహర్

Ap Ration Card: ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శనివారం గుంటూరు జిల్లా పరిషత్‌ సమావేశంలో మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల గురించి పలువురు అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. రేషన్ పంపిణీలో వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని అన్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని వైసీపీ పెద్దలు దారి మళ్లించి కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. పేదలకు అందాల్సిన రేషన్ లో అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అధికారులను హెచ్చరించారు.

వచ్చే నెల నుండి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వ చర్యల వల్ల పౌర సరఫరాల శాఖకు భారీగా నష్టం జరిగిందని ఆయన విమర్సించారు. డోర్ డెలివరీ పేరుతో ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేసినా ఎక్కడా డోర్ డెలివరీ జరగలేదని మంత్రి నాదెండ్ల అన్నారు.

Also read: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత

Advertisment
Advertisment
తాజా కథనాలు