Elections 2024 : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మరో నాలుగు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. వైసీపీ(YCP), కూటమిల మధ్య పోరారోరీ హోరు నడుస్తోంది. ఇప్పటికే అక్కడ గెలుపు ఎవరన్న దాని గురించి బోలెడు సర్వేలు వచ్చాయి. కొంతమంది మళ్ళీ వైసీపీఏ వస్తుంది అంటుంటే.. మరి కొంత మంది కూటమికి పట్టాం కట్టాయి. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఏపీ ఎన్నికలపై తన జోస్యాన్ని చెప్పారు.
నాకు కూటమి అభ్యర్థులే ముఖ్యం వైసీపీ కాంగ్రెస్ వామపక్షాలతో నాకు సంబంధం లేదు అన్నారు గోనె ప్రకాశరావు(Gone Prakash Rao). జగన్ వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. అందుకే రాష్ట్రం బావుండలి అంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు రావాలి.దేశం లో ఉన్న సర్వేలు అన్ని కూటమి గెలుపు ఖాయం అని చెప్తున్నాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ,స్టేట్ ఇంటిలిజెన్స్ తో పాటు జగన్ సర్వేలు కూడా గెలవబోయేది కుటమే అని స్పష్టం చేశాయి అని చెప్పారు గోనె ప్రకాశరావు.
ఈసారి ఎన్నికల్లో కూటమి 19 - 21 మధ్యలో పార్లమెంట్ స్థానాలు గెలవనుంది అని అన్నారు గోనె. అలాగే 120 -140 మధ్యలో అసెంబ్లీ స్థానాలు కూటమి సొంతం చేసుకోబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూటమి ప్రభంజనం చూస్తారని..స్థానికులతో మాట్లాడుతుంటే కేశినేని నాని కి,చిన్ని కి భూమికి.. ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని చెప్పుకొచ్చారు. 2 లక్షల మెజారిటీ తో కేశినేని చిన్ని గెలవబోతున్నారు.
మరో వైపు ఏపీ సీఎం జగన్(CM Jagan) మీద తీవ్ర విమర్శలు చేశారు గోనె ప్రకాశరావు. కొన్ని ఛానెల్స్ తో జగన్ చేసిన ఇంటర్వ్యూలు చూస్తుంటే అవి మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరికి అర్థం అవుతుంది.జగన్ ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. అధికారం కోసం జగన్ అబద్ధాలు చెప్తున్నాడు.తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని వాడు రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తాడు. వైఎస్ వివేకానంద రెడ్డి పై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారు.కాంగ్రెస్, సోనియా గాంధీ జగన్ ను ఒప్పుకోలేదు. అందుకే జగన్ వివేకా ను నాశనం చెయ్యాలి అని చూసాడు.ఈ రోజు జగన్ కి భారతి స్ట్రోక్ తగలబోతుంది.పవర్ ప్రాజెక్ట్ లో డబ్బులు సంపాందించకపోతే జగన్ కు భారతి సిమెంట్ ,సాక్షి పేపర్ ,సాక్షి టీవీ ఎలా వచ్చాయి అంటూ ప్రశించారు గోనె ప్రకాశరావు.