Hyderabad: నవనీత్‌కు కౌంటరిచ్చిన అసదుద్దీన్ ఓవైసీ

ఎన్నికల వేళ బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గంట తీసుకోండి...ముస్లింలను ఏం చేస్తారో చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Hyderabad: నవనీత్‌కు కౌంటరిచ్చిన అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi Counter To Navneet Kaur: 15 సెకన్లు ఎందుకు..గంట సమయం తీసుకోండి..ముస్లింలను ఏం చేస్తారో చేయండి అంటూ ఎంఐఎం నేత అసుద్దీన్ ఓవైసీ విరుచుపడ్డారు. మేం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం అంటూ అసదుద్దీన్‌ బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ తమపై చేసిన సంచలన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది...ఏమైనా చేయగలరు అంటూ మండిపడ్డారు.

దుమారం రేపిన నవనీత్ కౌర్ వ్యాఖ్యలు.. 

అంతకు ముందు మహారాష్ట్రలోని అమరావతికి చెందిన బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్ధి మాధవీలత ప్రచారానికి వచ్చిన ఆమె ఎంఐఎం సోదరులపై వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 15 నిమిషాల పాటు వెనుదిరిగితే.. మేమేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.. కానీ మాకు 15 సెకన్లు మాత్రమే చాలు. సోదరిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తెలియదు అంటూ నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వీటి మీద ఎంఐఎం నేతలు విరుచుకుపడుతున్నారు.

Also Read:Hyderabad: తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు..ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు