Gold Rates Drop: ఇది శుభవార్తే.. బంగారం ధరలు కాస్త తగ్గాయి.. వెండి మాత్రం.. 

వరుసగా  స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,000ల వద్దకు చేరాయి.  ఇక వెండి ధర కేజీకి 300 పెరిగి రూ.76,800 వద్ద ఉంది.

Gold Rates Drop: ఇది శుభవార్తే.. బంగారం ధరలు కాస్త తగ్గాయి.. వెండి మాత్రం.. 
New Update

Gold Rate Today: నాలుగు రోజులపాటు స్థిరంగా ఉన్న బంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరట కల్పించాయి. ఇప్పుడు బంగారం ధరలు స్స్వల్పంగా తగ్గి (Gold Rates Dropped) గుడ్ న్యూస్ తీసుకువచ్చాయి. బంగారం ధరలు తగ్గడం అంటే పసిడి ప్రియులకు సంతోషాన్నిచ్చే విషయమే కదా. బంగారం ధరలు తగ్గుతుండడంతో కొనడానికి ఇదే మంచి సమయం అని అందరూ భావిస్తున్నారు.  బంగారం, వెండి ధరలు నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు నాలుగు రోజులుగా స్థిరంగా ఉంది.. తగ్గుదల బాటలోకి వచ్చాయి. నిన్న వెండి ధరలు తగ్గిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు మాత్రం  కాస్త పెరిగాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు రెండురోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు ఈరోజు కూడా తగ్గాయి.   ఈరోజు అంటే గురువారం (జనవరి 25) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.       

హైదరాబాద్ లో బంగారం ధరలు:     

హైదరాబాద్(Hyderabad) లో వరుసగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు తగ్గుదల  కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold Price) 50 రూపాయలు తగ్గి రూ.57,750ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 50 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 63,000లకు దిగివచ్చింది.   అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర  10 గ్రాములకు 50 రూపాయలు తగ్గి రూ.57,900ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 గ్రాములకు 50 రూపాయలు తగ్గింది.  దీంతో  రూ.63,150ల వద్ద కు చేరింది. 

Also Read: బంగారం కొనేవారికి మంచి అవకాశం.. నిలకడగా ధరలు 

వెండి ధరలు ఇలా: 

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Price Today) తగ్గుదల కనపరుస్తుంటే మరోవైపు వెండి ధరలు మాత్రం ఈరోజు పెరుగుదల కనబరిచాయి. కేజీ వెండి ధరలు 300 రూపాయల మేర పెరిగాయి.  దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.76,800ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 300 రూపాయలు పెరిగింది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,300 లకు చేరుకుంది. 

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు  కాస్త తగ్గాయి. ఈరోజు ఔన్స్ బంగారం  2015 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.71 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

#gold #gold-price #gold-and-silver-price #gold-rate-today #gold-rate-today-hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe