Gold Rate Today : బంగారం(Gold) కొనాలని అనుకునే వారిని ఎప్పటికప్పుడు ధరల మార్పుతో టెన్షన్ పెడుతుంది. అయితే, వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా ఉండడం కాస్త ఊరట కల్పించినట్లే. బంగారం ధరలు మార్పులేకుండా ఉండడం అంటే.. కొనాలని అనుకునే వారికీ మంచి అవకాశం గానే చెప్పవచ్చు. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో.. దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. అంతకు ముందు వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా రెండోరోజూ అంటే జనవరి 23న నిలకడగా నిలిచాయి. బంగారం ధరల(Gold rate in India) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడ .. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 23న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold rate in India)కొద్దిగా తగ్గింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతూ ఉండడంతో భవిష్యత్ లో ఇక్కడ కూడా ధరలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే స్థిరంగా ఉన్నాయి. ఈరోజు అంటే మంగళవారం (జనవరి 23) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rate in India : బంగారం కొనేవారికి మంచి అవకాశం.. నిలకడగా ధరలు
వరుసగా రెండో రోజూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.77,000 వద్ద మార్పులు లేకుండా ఉంది.
Translate this News: