/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Today-Gold-Rates-1-2-jpg.webp)
Gold And Silver Rates Today: ఫిబ్రవరి అంటే మాఘమాసం. పెళ్ళిళ్ళ సీజన్ (Wedding Season) మొదలు. ఇక్కడి నుంచి వరుస ముహూర్తాలు ఉంటాయి. బట్టలు, బంగారం కొనుగోలుకు మంచి గిరాకీ ఉంటుంది. కానీ ఇలాంటి టైమ్‌లో బంగారం ధరలు పెరిగితే.. ఇంక అంతే. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అందరూ ఇదే సాక్‌లో ఉన్నారు. తగ్గినట్టే తగ్గిన పసిడి ధరలు మళ్ళీ (Gold Price) పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకావం ఉందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అంతకు ముందు గోల్డ్ గిరాకీ బాగా తగ్గింది. మధ్యలో ఓ మూడు రోజులు భారగీ ధరలు తగ్గడంతో ఇది పెరుగుతుందని ఆశించారు వ్యాపారస్తులు. కానీ ఇప్పుడు మళ్ళీ రేట్స్ పెరుగుతుండడంతో నిరాశ గిరాకీ పడిపోతుందని నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం..అనుమానంతో భార్యకు గుండు కొట్టించిన భర్త
ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర (Gold Rate) ఔన్సుకు 2040 డాలర్ల దగ్గర ఊగిసలాడుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 22.70 వద్ద ఉంది. కిందటి రోజుతో పోలిస్తేఅంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.015 వద్ద ఉంది.
మన దేశంలో బంగారం ధరలు..
దేశీయంగా బంగారం, వెండి రేట్లు మాత్రం వరుసగా పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో వరుసగా ఐదో రోజు బంగారం రేటు పెరిగింది. చివరగా జనవరి 25న పసిడి ధర తగ్గుముఖం పట్టింది. అక్కడి నుంచి మళ్లీ అసలు తగ్గనేలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ పసిడి ధర 10 గ్రాములకు రూ. 150 పెరిగి రూ. 58,300 మార్కు వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 160 పెరిగి తులానికి రూ. 63,600 వద్దకు చేరుకుంది. గత 5 రోజుల్లో చూసుకుంటే ఈరోజు బంగారం ధర రూ. 650 పెరగింది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) కూడా బంగారం రేటు పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల పుత్తడి రేటు ఇవాళ రూ. 150 పెరిగి ప్రస్తుతం 10 గ్రాములు రూ. 58,450 కు చేరింది. ఇంకా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 160 ఎగబాకి రూ. 63,750 వద్ద ఉంది.
వెండి కూడా పెరిగింది..
మరోవైపు బంగారంతో పాటూ వెండి ధర (Silver price) కూడా పెరుగుతోంది. ఢిల్లీలో నిన్న రూ. 200 తగ్గంది కానీ మళ్లీ ఇవాళ రూ. 200 పెరిగి కిలోకు రూ. 76,500 వద్దకు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో వెండి ధర రూ. 200 పెరిగి ప్రస్తుతం రూ. 78 వేల మార్కు వద్ద కొనసాగుతోంది.