Gold Rate :ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు

బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. డిసెంబర్ నెలలో ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 63వేలను తాకి ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని నమోదు చేసుకుంది.

New Update
Gold Loans: గోల్డ్ లోన్స్ విషయంలో బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచనలు 

Gold Rate Today: బాబోయ్ బంగారం అంటున్నారు పసిడి ప్రియులు. వరుసగా రేటు పెరుగుతూ షాక్ ఇస్తోంది గోల్డ్. ఒకటి రెండు రోజులు తగ్గిందని సంబరపడేలోపే మరుసటి రోజు భారీగా పెరుగుతోంది. 3 రోజులు తగ్గినదానితో సమానంగా ఒక్కరోజే పైకెగుస్తోంది. గత 10 రోజుల వ్యవధిలో బంగారం రేటు 4 రోజులు తగ్గగా.. మరో 4 రోజులు పెరిగింది. మధ్యలో రెండు రోజులు మాత్రం స్థిరంగా కొనసాగింది. ఈ 10 రోజుల్లోనే గోల్డ్ రేటు రూ. 800 కుపైగా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం ధర పెరుగుతోంది.

Also Read:అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..

నిన్న స్థిరంగా బంగారం ధర (Gold Price) నేడు భారీగా పెరిగింది. మార్కెట్ లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,620గా ఉండగా...22 క్యారెట్ల బంగారం ధర 57, 400 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం రేటు 63వేలుగా కొనసాగుండగా..22 క్యారెట్లు మాత్రం 57, 500 దగ్గర ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ మీద 350 రూ. పెరగింది. ఇక 24 క్యారెట్ల మీద అయితే 380 రూ. పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 2036 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు మాత్రం 24.25 డాలర్ల వద్ద ఉంది. ఇవి స్వల్పంగా పెరిగాయని చెప్పొచ్చు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 83.185 వద్ద ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు