Gold Rate Today: భారతీయులకు బంగారంతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. పండగ కానీ, ఫంక్షన్ కానీ, వివాహాది శుభకార్యాలు కానీ బంగారం కొనాల్సిందే. కేవలం బంగారం మాత్రమే కాదు వెండిని కూడా కొనుగోలు చేస్తారు. అందుకు బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అయితే తీరొక్క నగలు వేసుకోవాలని ముచ్చపడుతుంటారు. అందుకే వారికి నచ్చిన డిజైన్లు కొనుగోలు చేస్తూనే ఉంటారు. సందర్భంగా వచ్చిందంటే చాలు నగల షాపులకు పరుగులు పెడుతుంటారు. కొంతమంది మహిళలయితే ఎప్పుడూ కొంటూనే ఉంటారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం..పసిడి, వెండి ధరల్లో (Gold Rate) ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు ఉంటూనే ఉంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే..కొన్ని సార్లు భారీగా పెరుగుతుంటాయి. అయితే తాజాగా బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. మంగళవారం ఉదయం వరకు నమోదు అయిన ధరల ప్రకారం. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 57,350 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 62,560గా నమోదు అయ్యింది. 22 క్యారెట్లపై రూ. 250, 24 క్యారెట్లపై రూ. 270 మేర ధర పెరిగింది. కిలో వెండి ధర రూ. 1,300 మేర పెరిగింది. ప్రస్తుతం రూ. 78, 500వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటుగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో ఓసారి చూద్దాం.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త…ఆ బ్యాంకు నుంచి ఉచితంగా రూ.10వేలు…ఇలా ఆప్లై చేస్తే సరి..!!
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు :
ఢిల్లీలో 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.57,500
24 క్యారెట్ల ధర రూ.62,710
ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,350,
24 క్యారెట్ల ధర రూ.62,560,
కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,350,
24 క్యారెట్ల ధర రూ.62,560,
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,800,
24 క్యారెట్ల ధర రూ.63,050,
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350,
24 క్యారెట్ల ధర రూ.62,560,
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,350,
24 క్యారెట్ల ధర రూ.62,560 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు:
హైదరాబాద్‌లో (Hyderabad Gold Rate) 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.57,350
24 క్యారెట్ల పసిడి ధర రూ.62,560
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.57,350,
24 క్యారెట్ల ధర రూ.62,560
వెండి ధరలు:
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.78,500
ముంబైలో రూ.78,500
చెన్నైలో రూ.81,500
బెంగళూరులో రూ.76,250
కేరళలో రూ.81,500
కోల్‌కతాలో రూ.78,500
హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.81,500
విజయవాడలో రూ.81,500
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.81,500