Leh-Ladakh: మంచు పర్వతాలు మన సహజ సంపద అని, అవి చాలా విలువైనవని, గ్లేసియర్స్ నుంచే మనకు నీళ్లు వస్తాయి. అలాంటి గ్లేసియర్స్ మనకు హియాలయా ప్రాంతాల్లోనే ఉంటాయి. జమ్మూ-కశ్మీర్, లేహ్-లడఖ్‌లో మనకు అలాంటి మంచు పర్వతాలు ఉన్నాయి. అక్కడా దాదాపు ఏడాది అంతా మంచు ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మంచు పర్వతాలు, గ్లేసియర్స్ కరిగిపోతున్నాయి.
లడాఖ్‌లో ప్రస్తుతం 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.ఈ ప్రాంతంలో 30 డిగ్రీలు అంటే చాలా ఎక్కువ అన్నమాట. దీని కారణంగా హిమాలయాల్లో పేరుకుని ఉన్న మంచు తొందరగా కరిగిపోతోంది. లడాఖ్‌లో 30 డిగ్రీల ఉషణోగరత అంటే.. మెట్ట ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లే అని.. అంత వేడి ఉంటే హిమాలయ పర్వతాలపై ఉన్న ఐస్ వేగంగా కరిగిపోతోందని జమ్మూ-కశ్మీర్ మెటీరాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ సోనమ్ లోటస్ తెలిపారు.
ఈసారి లేహ్‌లో అత్యధికంగా 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జూలై 28వ తేదీన కార్గిల్‌లో అత్యధికంగా 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యిందన్నారు. జూలై రెండో వారం నుంచి ఆగస్టు మధ్య వరకు, అంటే సుమారు 45 రోజులు వేడి వాతావరణం ఉంటుందన్నారు. వేడి వల్ల కొన్ని సందర్భాల్లో వర్షం కూడా కురుస్తుందని చెప్పారు సోనమ్.
Also Read:Kerala: ప్రమాదానికి గురైన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్