Bandi Sanjay: 22న సెలవు ఇవ్వండి.. రేవంత్ సర్కార్ కు బండి సంజయ్ రిక్వెస్ట్! ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆరోజు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బండి సంజయ్. తద్వారా పవిత్రమైన దైవ కార్యాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. By V.J Reddy 19 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bandi Sanjay: ఈనెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఆ రోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా పవిత్రమైన దైవ కార్యాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. ALSO READ: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరు మృతి.. ఈరోజు మధ్యాహ్నం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ప్రసిద్దిగాంచిన సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పండితులు బండి సంజయ్ కు ఆశీస్సులు అందించారు. అనంతరం బండి సంజయ్ చీపురు, పార బట్టి సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు క్రిష్ణా రెడ్డి సహా పార్టీ కార్యకర్తలంతా చీపురు పట్టి ఆలయ పరిసరాల్లో మొలిచిన పిచ్చి మొక్కలను ఏరిపారేశారు. చెత్త చెదారాన్ని ఊడ్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ….ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు దేవాలయాల శుద్ది చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయ పరిసరాలను శుద్ది చేయడం సంతోషంగా వుందన్నారు. అయోధ్యలో ఈనెల 22న జరగబోయే అందాల రాముడు, అయోధ్య రాముడు, ఆదర్శ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోందన్నారు. తెలంగాణ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధమైన నేపథ్యంలో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్చందంగ పాల్గొంటున్నారని చెప్పారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణ లో తెలంగాణ అగ్రభాగాన వుంది. కాంగ్రెస్ దుష్ప్రచారం.. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా… ‘‘అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి బియ్యం, జై శ్రీరాం బియ్యం అనే రకాలు వుండవు. పవిత్రమైన దేవుడి అక్షింతలను రేషన్ బియ్యం అంటూ కాంగ్రెస్ నేతలు వక్రీకరించడం తగదు. కాంగ్రెస్ నేతలు కోరితే బాసుమతి బియ్యాన్ని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని పేర్కొన్నారు. DO WATCH: #cm-revanth-reddy #bjp-party #22nd-holiday #ayodhhya-ram-mandir #bandi-sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి