Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరు మృతి.. రామోజీ ఫిల్మ్ సిటీలో లైమ్లైట్ గార్డెన్ వద్ద ఫిల్మ్ సిటీ విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా మృతి చెందారు. ఆ కంపెనీ చైర్మన్ విశ్వనాథన్రాజుకు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. By B Aravind 19 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. లైమ్లైట్ గార్డెన్ వద్ద ఫిల్మ్ సిటీ విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. అయితే చనిపోయింది విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇక కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Also read: ఆంధ్రాలో కులగణన ప్రారంభం విశ్వనాథరాజు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్‌లో పోలీసులు కేసు నమోదుచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ మెనేజ్‌మెంట్‌ను నిందితుడిగా చేర్చారు. జానకీరాం రాజు అనే ప్రైవేటు ఉద్యోగి ఈ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: వీడిన వికారాబాద్ మర్డర్ మిస్టరీ..వెలుగులోకి సంచలన విషయాలు #telugu-news #ramojirao #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి