NTR: ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వండి మోడీ గారు: కేశినేని నాని!

నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు కి కూడా భారతరత్న ప్రకటించాలని వైసీపీ నేత కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్‌ మీడియా వేదికగా కోరారు. సినీ రంగంతో పాటు, రాజకీయాల్లో ఆయన చేసిన సేవలను కేంద్రం గుర్తించి భారతరత్న ప్రకటించాలని కోరారు

New Update
NTR: ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వండి మోడీ గారు: కేశినేని నాని!

Kesineni Nani: భారత మాజీ ప్రధాని, తెలుగు వ్యక్తి అయినటువంటి పీవీ నరసింహ రావుకి (PV Narasimha Rao) కేంద్రం భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావు కి (Nandamuri Taraka Rama Rao) కూడా భారతరత్న (Bharat Ratna) ప్రకటించాలని వైసీపీ నేత కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని సోషల్‌ మీడియా వేదికగా కోరారు.

తెలుగు సినీ రంగంతో పాటు, రాజకీయాల్లో ఆయన చేసిన సేవలను కేంద్రం గుర్తించి భారతరత్న ప్రకటించాలని ఆయన కోరారు. ప్రతి తెలుగు వాడి కోరిక ఎన్టీఆర్‌ కి భారతరత్న రావాలని అని నాని అన్నారు. తెలుగు వారైన పీవీకి భారతరత్న ఇచ్చినప్పుడు ఎన్టీఆర్‌ కి కూడా ఇవ్వాలని నాని కేంద్రాన్ని కోరారు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో ఆయనను సత్కరించడం ఆయన వారసత్వానికి మనం ఇచ్చే నిజమైన నివాళి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఈ చిరకాల డిమాండ్‌ని దయచేసి పరిశీలించండి అంటూ కేశినేని అన్నారు.

Also read: రూ. 108 కే 60 రోజుల ఇంటర్నెట్‌..BSNL అదిరిపోయే ఆఫర్‌!

Advertisment
తాజా కథనాలు