Beautiful Nails: గోర్లు పెరగాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గోళ్లను పదేపదే కత్తిరించకుండా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది గోళ్ల పెరుగుదలను ఆపవచ్చని నిపుణులు అంటున్నారు. గోళ్లు తొందరగా పెరగాలన్నా..?, మంచి షైనింగ్ రావాలన్నా..? ఈ ఆర్టికల్ చెప్పిలోకి వెళ్లిడి చూడండి.
ప్రతి అమ్మాయికి పొడవాటి గోర్లు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ చాలా మంది అమ్మాయిలు తమ గోర్లు పొడవుగా లేవని బాధపడుతుంటారు. అంతేకాకుండా ఆడపిల్లలు తమ గోళ్లను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గోళ్లు మాత్రం పెరగవు. చిన్న చిట్కాలతో గోళ్లను సులభంగా పెంచుకోవచ్చు. అంతేకాకుండా అందంగా కూడా మార్చుకోవచ్చు.
గోళ్లు పెరగాలంటే..?
గోళ్లు తొందరగా పెరగాలన్నా, మంచి షైనింగ్ రావాలన్నా ముందుగా మీ గోళ్లను ఆరెంజ్ జ్యూస్‌లో 10 నిమిషాలు నానబెట్టాలని, ఆ తర్వాత తేడా మీకే తెలుస్తుందని బ్యూటీషియన్స్ అంటున్నారు. అలాగే ఒక చెంచా ఆలివ్ ఆయిల్‌లో నిమ్మరసం కలిపి గోళ్లకు మసాజ్ చేయవచ్చు. వేడి గ్రీన్ టీలో గోళ్లను నానబెట్టవచ్చు. అంతేకాకుండా పోషకాహారం తీసుకుంటే గోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి:
గోర్లు పెరగాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గోళ్లను పదేపదే కత్తిరించకుండా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది గోళ్ల పెరుగుదలను ఆపవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పాత్రలను శుభ్రపరిచేటప్పుడు చేతి తొడుగులు ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయకపోతే గోళ్లు విరిగిపోతాయని అంటున్నారు. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవన్నీ చేసినా గోర్లు పెరగకపోతే మాత్రం వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: రీల్స్‌కు బానిసగా మారారా?..ఇలా బయటపడండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.