Smartphone Reels: రీల్స్‌కు బానిసగా మారారా?..ఇలా బయటపడండి ఫోన్లో రీల్స్ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు. రీల్స్ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. రీల్స్‌కు బానిసగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Smartphone Reels: వ్యసనం గురించి ప్రస్తావన వస్తే సాధారణంగా మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ లేదా పొగాకు గురించి చెబుతుంటారు. అయితే ఫోన్ వ్యసనం అనేది వీటి కంటే పెద్దదని నిపుణులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. రీల్స్ చూడటం, చేయడం అనేది బాగా వ్యసనంగా మారిపోయింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. ఇది సమయాన్ని వృథా చేయడమే కాకుండా మన శరీరం, మనస్సు రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. కుటుంబానికి సమయం ఇవ్వండి: ఇతరులతో కనెక్ట్ కావడం కోసమే మొబైల్ ఫోన్ ఉంది. ముఖ్యమైన సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి, పంచుకోవడానికి మాత్రమే ఫోన్‌ని ఉపయోగించాలి. మీ ఫోన్లో Instagram, Facebook, Snapchat వంటి యాప్‌లు ఉంటే మీ కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడానికి కూడా మీకు సమయం దొరకడం కష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కువ సమయం ఫోన్ వాడకుండా కుటుంబంతో కలిసి గడపాలని నిపుణులు చెబుతున్నారు. మనసును ఇలా రిలాక్స్ చేసుకోండి: ఈ రోజుల్లో ప్రజలు కొన్ని గంటలు కూడా ఫోన్‌కు దూరంగా ఉండలేకపోతున్నారు. ఫోన్ దగ్గర లేకపోతే నిద్ర, మనశాంతి కూడా ఉండదు. ట్రెండింగ్ ఏంటో తెలుసుకోవడంలో ఇతరుల కంటే ఎక్కడ వెనుకపడిపోతారో అన్న భయంతో ఫోన్‌ను మాత్రం వదిలిపెట్టరు. ఫోన్లో రీల్స్ చూడటానికి బదులు సంగీతం వినవచ్చు, నడవవచ్చు, క్రాఫ్ట్ చేయవచ్చు, పుస్తకం చదవవచ్చు లేదా నిద్రపోవచ్చు. ఇలా చేయడం వల్ల మెదడుకు మంచి ప్రశాంతత, విశ్రాంతి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్నేహితులకు ఫోన్ చేయండి: ఫోన్లో రీల్స్ చూసే బదులు స్నేహితులు లేదా బంధువులకు కాల్ చేయండి. సన్నిహిత వ్యక్తులను భోజనానికి ఆహ్వానించండి లేదా వ్యాయామాలు చేయాలి. వినోదం కోసం రీల్స్ చూస్తుంటే దానికి బదులు ప్రత్యక్ష సంగీత కచేరీకి వెళ్లడం, తోటపని చేయడం, పొరుగువారితో కలిసి నడవడం, అందరితో కలిసి కూర్చుని సినిమా చూడటం వంటివి చేయాలి. ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? రీల్స్ చూడటం అనేది మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. మీ శ్రద్ద తగ్గుతుంది, అంతేకాకుండా జీవితాన్ని ఇతరులతో పోల్చడం ద్వారా అసంతృప్తి చెందుతారని నిపుణులు అంటున్నారు. ఫోన్‌ని నిరంతరం పట్టుకోవడం వల్ల మెడ, వేళ్లలో నొప్పి వస్తుంది. దీని వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అందుకే రీల్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: మెడ నల్లగా మారడం దేనికి సంకేతం..ఈ అవయవానికి ముప్పుతప్పదా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #reels #health-care #health-problems #smartphone #follow-tips #best-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి