World cup:జంటిల్మన్ గేమ్..న్యూజిలాండ్ క్రికెటర్ల క్రీడా స్ఫూర్తి

క్రికెట్ జంటిల్మన్ గేమ్ అని నిరూపించారు న్యూజిలాండ్ బాటర్లు. వరల్డ్ కప్ లో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అందరి మన్ననలనూ పొందారు. అసలేం జరిగిందంటే...

New Update
World cup:జంటిల్మన్ గేమ్..న్యూజిలాండ్ క్రికెటర్ల క్రీడా స్ఫూర్తి

వన్డే ప్రపంచకప్ లో ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ ఈ రోజు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మొదట బ్యాటింగ్ కు దిగారు. ఇందులో ఒక టైమ్లో ఓ వర్ త్రో కారణంగా అదనపు పరుగులు చేసే అవకాశం వచ్చినప్పటికీ క్రీజ్ లో ఉన్న బ్యాటర్లు దానిని తిరస్కరించి తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు.

Also Read:షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

కీవీస్ ఇన్నింగ్స్ లో 24 ఓవర్ రచిన్ రవీంద్ర, మిచెల్ ఆడుతున్నారు. జడేజా బౌలింగ్ వేస్తున్నాడు. ఇందులో నాలుగో బంతిని రచిన్ లెగ్ స్క్వేర్ దిశగా ఆడాడు. రెండు పరుగులు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో స్క్వేర్ లెగ్ ఫీల్డర్ నాన్ స్ట్రైక్ వైపు బంతిని విసిరాడు. కానీ త్రో సరిగ్గా లేకపోవడంతో జడేజా బంతిని అందుకోలేకపోయాడు. దీంతో ఓవర్ త్రో అయి మరో పరుగు చేసే అవకాశం లభించింది కీవీస్ బ్యాటర్లకు. కానీ క్రీజ్ లో ఉన్న రచిన్ , మిచెల్ ఇద్దరూ పరుగును చేయకుండా తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఇక్కడ ఇద్దరూ పరుగును తిరస్కరించడం విశేషం. వీరు చేసిన పని భారత క్రికెట్ అభిమానుల మనసు దోచుకుంది. అందుకే వెంటనే అందరూ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు.

Also Read:ఫ్రెండ్‌షిప్‌ కోటాలో అతడిని ఆడిస్తున్నారా’? ‘రోహిత్‌.. ఏంటిది?’

Advertisment
తాజా కథనాలు