Gautam Gambhir: పాకిస్థాన్‌ ఆటగాళ్లతో అతిస్నేహం వద్దు

భారత్‌-పాకిస్థాన్‌ టీమ్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే మ్యాచ్‌ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఇరు దేశాలకు చెందిన ప్లేయర్లు ఒకరి పై మరోకరు దురుసగా ప్రవర్తిండచం, బౌలర్‌ కావాలని బ్యాటర్‌ మొహానికి విసరం, బ్యాటర్‌ కావాలనే బౌలర్‌ తలపై బాల్‌ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

New Update
Gautam Gambhir: పాకిస్థాన్‌ ఆటగాళ్లతో అతిస్నేహం వద్దు

భారత్‌-పాకిస్థాన్‌ టీమ్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే మ్యాచ్‌ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఇరు దేశాలకు చెందిన ప్లేయర్లు ఒకరి పై మరోకరు దురుసగా ప్రవర్తిండచం, బౌలర్‌ కావాలని బ్యాటర్‌ మొహానికి విసరం, బ్యాటర్‌ కావాలనే బౌలర్‌ తలపై బాల్‌ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో టీవీల్లో, స్టేడియంలో మ్యాచ్‌ చూస్తున్న ప్రేక్షకులు సైతం యుద్ధం చేస్తున్నట్లే ఉంటారు. దీనిపై భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. గతంలో ఇరు జట్లు క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడే సమయంలో గొడవలు జరిగేవని, అది రాను రాను వారసత్వంగా మారిందన్నారు.

కానీ ప్రస్తుతం ఇరు జట్ల క్రికెటర్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని, ఇరువురు ప్లేయర్లు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారని, ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారని తెలిపాడు. దీనికి నిదర్శనం ఇటీవల ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సన్నివేశామే అన్నారు. భారత ఇన్నింగ్స్‌ అనంతరం వర్షంపడుతున్న సమయంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌, రోహిత్‌ శర్మ కలిసి మాట్లాడుకోవడం చూశానన్నాడు. మరోవైపు యంగ్‌ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ అద్భుత ప్రదర్శన చూపడంతో పాక్‌ టీమ్‌లోని ఇతర క్రికెటర్లు అతన్ని పొగడ్తలతో ముంచెత్తారని గుర్తు చేశాడు.

అంతే కాకుండా షాహిన్‌ అఫ్రీదీ బౌలింగ్‌ను ఇషాన్‌ కిషన్‌ సమర్దవంతంగా ఎదర్కొవడంతో.. అఫ్రీదే ఇషాన్‌ కిషన్‌తో సూపర్‌ బ్యాటింగ్‌ అన్నట్లు మాట్లాడాడని గంభీర్‌ తెలిపాడు. మరోవైపు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్నేహం ఉండాలి కానీ అది అతి స్నేహంగా మారవద్దని గంభీర్ తెలిపాడు. ఆటగాళ్ల మధ్య స్నేహ సంబంధాలను ఫెవిలియన్‌ వరకే ఉంచుకోవాలని వాటిని మైదానంలోకి తీసుకురావద్దని సూచించాడు. భారత జట్టు గ్రౌండ్‌లోకి దిగుతే.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కాగా ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్‌ టీమ్‌లు మళ్లీ తలపడునున్నాయి.

Advertisment
తాజా కథనాలు