Delhi: ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ల పెళ్ళి..భారీ భద్రత

ఢిల్లీలో జరిగిన ఓ పెళ్ళి ఫుల్ వైరల్ అవుతోంది. దానికి కారణం ఆ పెళ్ళి చేసుకునే వారు...వారికి ఇచ్చిన భద్రత. జైల్లో ఉండాల్సిన గ్యాంగ్‌స్టర్లు పెరోల్‌ మీదకు వచ్చి పెళ్ళి చేసుకున్నారు. దానికి పోలీసులు భారీ భద్రత ఇచ్చారు. వివరాలు కింద చదవండి.

New Update
Delhi: ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ల పెళ్ళి..భారీ భద్రత

Gangster Marriage: వాళ్ళిద్దరూ గ్యాంగ్‌స్టర్లు. నాలుగేళ్ళ నుంచీ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వేర్వేరు నేరాల్లో జైల్లోనే ఉన్నారు. భవిష్యత్తు ఏమిటవుతుందో తెలియదు. కానీ పెళ్ళి మాత్రం చేసుకోవాలనుకున్నారు. దాని కోసం పర్మిషన్ తీసుకుని మరీ బయటకు వచ్చారు. ధూం ధాంగా పెళ్ళి చేసుకున్నారు. అది కూడా పోలీసుల భారీ భద్రత మధ్యన. సెలబ్రిటీలకు ఇచ్చఏ భద్రత కన్నా ఎక్కువ సెక్యూరిటీ వీళ్ళిద్దరి పెళ్ళికీ ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు.

ఎవరు వాళ్ళు..ఏమా కథ..

హరియాణాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జథేడీ. రాజస్థాన్‌కు చెందిన అనురాధా చౌదరి అలియాస్ మేడమ్ మింజ్. ఈమెకు రివాల్వర్ రాణి అని కూడా పేరు ఉంది. సందీప్, అనురాధాలు పలు కేసుల్లో నిందితులు. గ్యాంగ్‌స్టర్ లారెస్స్ బిష్ణోయ్‌కు...సందీప్ అత్యంత సన్నిహితుడు. ఇతని మీద దోపిడీ, హత్యాయత్నం లాంటి కేసులు ఉన్నాయి. డజనుకు పైగా కేసుల్లో సంబంధం ఉంది. అనురాధ కూడా ఆనందపాల్ సింగ్ అనే గ్యాంగ్‌స్టర్ దగ్గర పని చేసింది. మనీ లాండరింగ్, కిడ్నాప్, బెదిరింపులు లాంటి కేసులు ఆమె మీద ఉన్నాయి. వీళ్ళిద్దరూ చాలా కాలం పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. ఆ సమయంలో పలు రాష్ట్రాలు తిరిగారు. చివరకు 2021 జూలైలో పోలీసులకు చిక్కారు. అయితే అనురాధా కొంతకాలం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. కానీ సందీప్ మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. జైల్లో ఉన్నప్పుడు కూడా కొనసాగించారు. అందుకే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనురాధ ఎలానో బెయిల్ మీదనే ఉంది. సందీప్‌ పెళ్ళి కోసం ఆరుగంటల పెరోల్ మీద బయటకు వచ్చాడు.

publive-image

భారీ బందోబస్తు..

ఢిల్లీలో ద్వారకా సెక్టార్‌లో ఉన్న సంతోష్ గార్డెన్‌లో ఈ గ్యాంగ్‌స్టర్ల పెళ్ళి జరిగింది. ఎందుకంటే సందీప్‌ చాలాసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. దాంతో పాటూ బలగాలతో దాడి కూడా చేయించాడు. అందుకే ఇప్పుడు అతని పెళ్ళికి కాపాలాకాసారు పోలీసులు. మళ్ళీ తప్పించుకోకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్ డోర్లు దగ్గర మెటల్ డిటెక్టర్లును పెట్టారు. వచ్చే అతిధులకు బార్‌కోడ్లు, వాహనాలకు ఎంట్రీ పాసులు ఇచ్చారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించారు. మొత్తం పెళ్ళి జరుగుతన్నంతసేపూ 250 మంది పోలీసులు పహారా కాశారు. సందీప్ తరుఫు న్యాయవాది 51వేల రూ. ఇచ్చి కల్యాణ మండపం బుక్ చేశారు. ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించిన షోటోలు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి.

Also Read:Mumbai: ప్రపంచంలోనే అత్యంత రిచ్ బిచ్చగాడు..ముంబైలో విలువైన ఆస్తులు

Advertisment
Advertisment
తాజా కథనాలు