/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Dokka-Manikya-Varaprasad-jpg.webp)
Dokka Manikya Vara Prasad Joined in TDP: ఏపీలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. కాగా ఈరోజు ఆయన గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ పెద్దలకు పంపించారు.
గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీలో తీవ్ర అలజడి నెలకొంది. ఇదిలా ఉంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో భంగపడ్డ ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ పదవి హామీతోనే ఆయన టీడీపీలో చేరారనే ప్రచారం కూడా గుంటూరు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. మరి ఎన్నికల వేళ వైసీపీకి ఝలక్ ఇచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కు చంద్రబాబు ఏ పదవి ఇస్తారో వేచి చూడాలి.