Andhra Pradesh: అల్లూరి జిల్లా గండి పోచమ్మ ఆలయానికి పోటెత్తిన వరద

అల్లూరి జిల్లాలో గండి పోచమ్మ ఆలయానికి వరద పోటేత్తడంతో హుండీల లెక్కింపునకు అధికారులు సిద్ధమయ్యారు. భక్తులు నది ప్రాంగణం వైపు వెళ్లొద్దంటూ హెచ్చరిస్తున్నారు. వరద ఉద్ధృతితో పాపికొండల విహారయాత్రకు వెళ్లే 15 బోట్‌లను అధికారులు నిలిపివేశారు.

New Update
Andhra Pradesh: అల్లూరి జిల్లా గండి పోచమ్మ ఆలయానికి పోటెత్తిన వరద

ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాలో గండి పోచమ్మ ఆలయానికి వరద పొటేత్తింది. వరద తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ఆలయంలో హుండీల లెక్కింపునకు అధికారులు సిద్ధమయ్యారు. భక్తులు నది ప్రాంగణం వైపు వెళ్లొద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఎగువన కురిసిన వర్షాలకు పోలవరం ప్రాజెక్ట్‌కు భారీ వరద వచ్చి చేరింది. వరద ఉద్ధృతితో పాపికొండల విహారయాత్రకు వెళ్లే 15 బోట్‌లను అధికారులు నిలిపివేశారు.

Also read: చిక్కుల్లో ఇరుక్కున్న ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి

రంపచోడవరం,గోకవరం, దండంగి రహదారులు పూర్తిగా నీటమునిగాయి. ప్రస్తుతం గండి పోచమ్మ ఆలయం దగ్గర వరద నీరు నిలకడగా ఉంది. దీంతో అధికారులు పోలవరం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

Also Read: జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన…!

Advertisment
Advertisment
తాజా కథనాలు