Vijayawada: సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు.. ఆహారం లేక జనాల అవస్థలు

విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్‌లతో ఆహారం సరఫరా చేస్తున్నారు.

New Update
Vijayawada: సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు.. ఆహారం లేక జనాల అవస్థలు

వరద ప్రభావానికి విజవాడ జలదిగ్బంధమయ్యింది. సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీలు, రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్‌లతో ఆహారం సరఫరా చేస్తున్నారు. ఆహార పంపిణీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కానీ ఆహార పొట్లాలు అందరికీ అందడం లేదు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. రెండు రోజులుగా సిగ్నల్స్ లేక ఫోన్లు కూడా పనిచేయడం లేదు.

Also Read: వరద బాధితులకు రూ.10వేలు, పశువులకు రూ.50 వేలు.. రేవంత్ తక్షణ సాయం!

మరోవైపు ముంపు ప్రాంతాల వాసులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 176 కేంద్రాల్లో 45 వేల మందికి పైగా వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో 36 ఎన్డీఆర్‌ బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. 188 బోట్లు అందుబాటులో ఉన్నాయి. 280 మంది గజఈతగాళ్లు కూడా ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు