IPL: ఐపీఎల్ లో మొట్టమొదటి ట్రైబల్ ఆటగాడు..రాబిన్ మింజ్

ఐపీఎల్ 2024 వేలంలో భారత యంగ్ ప్లేయర్స్ కు కోట్ల వర్షం కురిసింది. ఎలాంటి ఆంచనాలు లేని..కొత్త ఆటగాళ్ళను కూడా కోట్లు పెట్టి కొనుక్కున్నాయి ఫ్రాంఛైజీలు.ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం రాబిన్ మింజ్. ఈ కొత్త కుర్రాడు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఐపీఎల్ అవుతున్నాడు.

New Update
IPL: ఐపీఎల్ లో మొట్టమొదటి ట్రైబల్ ఆటగాడు..రాబిన్ మింజ్

Robin Minz: అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఈసారి వేలంలో చరిత్ర సృష్టించారు. కేవలం 20లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చి కోట్లు పట్టుకుపోయారు. ఎవ్వరికీ తెలియని...ఎక్కడి నుంచో వచ్చిన కొత్త కుర్రాళ్ళను అంచనాలకు మించి మరీ ఫ్రాంఛైజీలు కొనుక్కున్నారు. వీరిలో ఇప్పుడు అందరినీ ఆకర్సిస్తున్నది రాబిన్ మింజ్. జార్ఖంబ్ (Jharkhand) నుంచి వచ్చిన ఈ యువ సంచలనఆన్ని గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఏకంగా 3.6 కోట్లు ఇచ్చి మరీ కొనుక్కుంది. ఒక కొత్త కుర్రాడికి ఇంత అమౌంట్ అంటే చాలా పెద్ద విషయమే. పైగా ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ దక్కించుకుంది.

Also Read:తెలంగాణ ఆస్తుల వివరాలను రిలీజ్ చేసిన బీఆర్ఎస్

ఐపీఎల్ (IPL) చరిత్రలో మొట్టమొదటి ట్రైబల్ క్రికెటర్ రాబిన్ మింజ్. జార్ఖండ్ జిల్లా గుమ్లాలోని పుట్టాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రాబిన్ తండ్రి ఇండియప్ ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే పిచ్చితో రాబిన్ పదవ తరగతితోనే చదువును ఆపేశాడు. ఆ తర్వాత మొత్తం ఫోకస్ అంతా క్రికెట్ మీదనే పెట్టాడు. క్లబ్ క్రికెట్, అండర్ 19, అండర్ 25 టోర్నీల్లో జార్ఖండ్ తరుఫున మంచి ప్రదర్శన కనబర్చాడు. వీటిల్లో మింజ్‌కు 140 పైనే స్ట్రైక్ రేట్ ఉంది.

వీటిత ర్వాత రాబిన్ దేశవాళీ టీ20ల్లో కూడా ఆడి తన సత్తా చాటుకున్నాడు. ఓడిశాలో జిగిన ఒక మ్యాచ్ లో ఇతను 35 బంతుల్లో 73 పరుగులు చేసి అందరి దృష్టిలోనూ పడ్డాడు. ఇప్పుడు అదే పెర్ఫామెన్స్ రాబిన్ కు ఐపీఎల్ లో ఎక్కువ ధర పలికేలా చేసింది. జార్ఖండ్ సీనియర్ ఆటగాడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనకు ఆదర్శం అని చెబుతున్న మింజ్ బౌలింగ్ కూడా చేయగలడు. మరి వచ్చే సీజన్ లో ఇతను ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు