ఉత్తర్‌ప్రదేశ్‌లో హత్రాస్ తొక్కిసలాట ఘటన దేశవ్యా్ప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అయితే భోలేబాబా అరెస్టు అవుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా భోలేబాబాపై తొలికేసు నమోదైనట్లు తెలుస్తోంది. పట్నా కోర్టులో ఈ కేసు ఫైల్ అయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. జూలై 2న హత్రాస్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమానికి 80 వేల మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ లెక్కకు మించి రెండున్నర లక్షల మంది హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. భోలే బాబా పాద ధూళిని తీసుకునేందుకు అక్కడున్నవారు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also read: ప్రారంభమైన ఏపీ- తెలంగాణ సీఎంల మీటింగ్.. ఆ అంశాలపై చర్చ!
అయితే భోలే బాబా వేదిక నుంచి వెళ్లిపోయాకే ఈ ఘటన జరిగిందని ఆయన తరఫు లాయర్ చెబుతున్నారు. మరోవైపు ప్రమాద సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నారని.. అక్కడున్న భక్తులను భద్రతా సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఈరోజు ముఖ్య సేవదార్‌గా ఉన్న దేవ్‌ప్రకాశ్ మధుకర్ నిందితుడిగా ఉన్నాడు. శుక్రవారం రాత్రి పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.
Also Read: ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏటా స్కాలర్‌షిప్