Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం..

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్‌ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్‌ డ్రమ్ములు నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

New Update
AP Crime : ప్రియురాలి హత్యకు యత్నం.. ప్రియుడి ఆత్మహత్య!

Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్‌ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్‌ డ్రమ్ములు (Chemical Drums) నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోదాము పరిసర ప్రాంతాల్లో దట్టమైన మంటలు, పొగలు కమ్ముకున్నాయి. సమాచారం మేరకు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదాము (Godown) యాజమాన్యం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.

Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి

Advertisment
తాజా కథనాలు