/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T103448.148.jpg)
Delhi Metro : కీలక పదవుల్లో ఉండే రాజకీయ నేతలు (Political Leaders) కొన్నిసార్లు బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణాలు చేస్తూ జనాలకు ఆశ్చర్యం కలిగిస్తారు. అయితే తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Sitharaman) కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. నిర్మలా సీతారామన్ నిలబడి ప్రయాణించడంతో.. తోటి ప్రయాణికులు ఆమెకు సీటు కూడా ఇవ్వలేదంటూ పలువురు నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ ఎవరు ఎవరితో ఆడతారు? షెడ్యూల్ ఇదిగో..
మరికొందరు ఆమె సింప్లిసిటీని మెచ్చుకోగా.. ఇంకొందరు ఇది లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) స్టంట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. కేంద్రమంత్రి ఎక్కాల్సింది మెట్రోలో కాదు, ముంబై లోకల్ రైళ్లలో ఎక్కి.. అక్కడ ఎదురవుతున్న సమస్యలను చూడాలని అంటున్నారు.
Also read: లోక్‌సభ ఐదో దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్
Smt @nsitharaman travels in Delhi Metro to Laxmi Nagar and interacts with fellow commuters. pic.twitter.com/HYSq3oUiAo
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) May 17, 2024