Mahashivratri 2024: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఏం పండ్లు తినాలి..?

మహాశివరాత్రి రోజుచాలా మంది ఉపవాసం ఉన్నవాళ్ల అరటిపండు, యాపిల్, బొప్పాయి, ద్రాక్ష పండ్లను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పండ్లను తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తితోపాటు.. కడుపు కూడా నిండుగా ఉంటుంది

New Update
Mahashivratri 2024: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటే ఏం పండ్లు తినాలి..?

Mahashivratri 2024: మహాశివరాత్రి రోజుచాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే.. సాయంత్రం వేళల్లో మాత్రం కొన్ని పండ్లను ఆహారంగా తీసుకుంటారు. కొన్ని పండ్లను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ పండ్లను తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. కడుపు కూడా నిండుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఉపవాస సమయంలో సరైన పండ్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని పండ్లు తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.

అరటిపండు:

  • అరటిపండు అనేది పోషకాహారం అధికంగా ఉండే పండు. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ B6 ఉన్నాయి. ఇది జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిదని, ఉపవాస సమయంలో దీన్ని తింటే కడుపు చాలా సేపు నిండుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

యాపిల్:

  • యాపిల్‌లో ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని తింటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

బొప్పాయి:

  • బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. ఉపవాస సమయంలో పోషకాహారం కూడా లభిస్తుంది.

ద్రాక్ష:

  • ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో సహజ చక్కెర ఉంటుంది. ఇది ఉపవాస సమయంలో తక్షణ శక్తిని అందిస్తుంది. ద్రాక్ష తీసుకోవడం వల్ల కూడా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: శివుడు మెడలో పామునే ఎందుకు ధరిస్తాడు?.. ఆ పాము పేరేంటో తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు